Pawan Kalyan Re-entry | శస్త్రచికిత్స తర్వాత మళ్లీ ప్రజల్లోకి పవన్ కల్యాణ్.. నేటి నుండి విధుల్లోకి రీఎంట్రీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan Re-entry | శస్త్రచికిత్స అనంతరం దాదాపు మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పూర్తిగా కోలుకుని నేడు మళ్లీ క్రియాశీల రాజకీయ, పరిపాలనా బాధ్యతల్లోకి అడుగుపెట్టనున్నారు. ఆయన తిరిగి విధుల్లోకి వస్తుండటంతో జనసేన పార్టీ (Janasena Party) శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం (Begumpet Airport) నుంచి ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం బయలుదేరనున్నారు. ఉదయం 10:40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోన్న పవన్ కల్యాణ్, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అనంతరం ఆయన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

Pawan Kalyan Re-entry | భారీ ఎత్తున ఏర్పాట్లు..

పవన్ కల్యాణ్ రాక సందర్భంగా గన్నవరం నుంచి మంగళగిరి వరకు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. మార్గమధ్యంలో పలుచోట్ల ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ బైక్ ర్యాలీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత, జనసైనికులు ఆయనను ఒక్కసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Pawan Kalyan Re-entry | పవన్ కల్యాణ్ రీఎంట్రీకి ప్రత్యేక ప్రాధాన్యత

శస్త్రచికిత్స తర్వాత పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ, ఇప్పుడు పూర్తిగా కోలుకుని తిరిగి విధుల్లోకి వస్తుండటం వారికి ఊరటనిచ్చింది. ఇకపై ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు, ప్రజా సమస్యలపై ఆయన మరింత చురుకుగా వ్యవహరించే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ పవన్ కల్యాణ్ రీఎంట్రీకి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. అధికార బాధ్యతలతో పాటు జనసేన పార్టీ బలోపేతంపై కూడా ఆయన దృష్టి సారించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో న‌రేంద్ర మోదీ భేటి అయి ఆయ‌న‌ ఆరోగ్య ప‌రిస్థితుల‌పై ఆరాలు తీసిన విష‌యం తెలిసిందే.

ఇది కూడా చదవండి..: Nidubrolu Railway Station | నిడుబ్రోలు రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత.. సిగ్నల్ వ్యవస్థతో చెలగాటం, పోలీసుల కాల్పులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *