జాతీయంLPG Subsidy Rules | గ్యాస్ వినియోగదారులకు షాక్.. వార్షిక ఆదాయం ఇంత దాటితే సబ్సిడీ...

LPG Subsidy Rules | గ్యాస్ వినియోగదారులకు షాక్.. వార్షిక ఆదాయం ఇంత దాటితే సబ్సిడీ రానట్టే!

వార్షిక ఆదాయం  సంవత్సరానికి రూ.10 లక్షలకు పైగా సంపాదిస్తున్న గృహ వినియోగదారులు ఇకపై గ్యాస్ సబ్సిడీకి అర్హులు కాకపోవచ్చు.

అక్షరటుడే వెబ్‌డెస్క్: LPG Subsidy Rules | వార్షిక ఆదాయం  సంవత్సరానికి రూ.10 లక్షలకు పైగా సంపాదిస్తున్న గృహ వినియోగదారులు ఇకపై గ్యాస్ సబ్సిడీకి అర్హులు కాకపోవచ్చు. ఇందుకు సంబంధించి ఇండేన్, హెచ్‌పీసీఎల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే వినియోగదారులకు ఎస్ఎంఎస్ (SMS) ద్వారా హెచ్చరికలు పంపిస్తున్నాయి.

LPG Subsidy Rules | ఏడు రోజులలోపు..

మెసేజ్ అందిన ఏడు రోజులలోపు ఆదాయ అర్హతపై వివరణ ఇవ్వాలని కంపెనీలు కోరుతున్నాయి. స్పందించని పక్షంలో సబ్సిడీని నిలిపివేసే అవకాశం ఉంది. ఒక కుటుంబంలో ఏ ఒక్క సభ్యుని వార్షిక ఆదాయం రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఉన్నా, ఆ కుటుంబం సబ్సిడీ అర్హత నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అర్హులను గుర్తించడానికి ప్రభుత్వం ఆదాయపు పన్ను (IT) రికార్డులను, ఆధార్ ఆధారిత e-KYC వివరాలను విశ్లేషిస్తోంది. ఏవైనా ఫిర్యాదులు లేదా సందేహాలు ఉంటే గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా లేదా టోల్-ఫ్రీ నంబర్ 1800233555 కు కాల్ చేసి సంప్రదించవచ్చు.

LPG Subsidy Rules | కారణాలు..

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడి కంపెనీల నష్టాలు పెరుగుతున్నాయి. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి సబ్సిడీ చెల్లింపులను సమీక్షిస్తున్నారు. 2026లో ఇప్పటికే ఆరుసార్లు వాణిజ్య గ్యాస్ ధరలను పెంచారు. మే 1న వాణిజ్య సిలిండర్ ధరపై రూ. 993 పెరిగింది. గతంలో ‘గివ్ ఇట్ అప్’ ద్వారా స్వచ్ఛందంగా వదులుకోవాలని కోరిన ప్రభుత్వం, ఇప్పుడు నేరుగా అనర్హులను తొలగించే ప్రక్రియను చేపట్టింది. ఇప్పటికే రేషన్ కార్డుల విషయంలో చేపట్టిన ఈ తనిఖీలను ఇప్పుడు ఎల్‌పీజీకి కూడా వర్తింపజేస్తున్నారు. ప్రస్తుతం గృహ వినియోగదారులు ఒక్కో సిలిండర్‌పై సుమారు రూ. 40 సబ్సిడీ పొందుతున్నారు. తాజా నిబంధనలతో ఆర్థికంగా స్థిరపడిన వారు ఈ ప్రయోజనాన్ని కోల్పోనున్నారు.

ఇది కూడా చదవండి: Nagarjuna T Shirts | నాగార్జున ఫొటోలతో టీ-షర్టుల విక్రయం.. ఢిల్లీ హైకోర్టు సీరియస్!

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Vijay Floor Test | బల పరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay Floor Test | తమిళనాడు (Tamil...

Srivani Tickets Scam | శ్రీవారి టికెట్ల హైజాక్.. సాఫ్ట్‌వేర్ వాడి అక్రమార్కుల దోపిడీ!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Srivani Tickets Scam |తిరుమల శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌లో...

NEET Paper Leak | రూ.30 లక్షలకు నీట్​ పేపర్​ కొనుగోలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: NEET Paper Leak | నీట్​ పేపర్​ లీకేజీ...