అంతర్జాతీయంDong Gongping Escape | రబ్బరు బోటులో 30 గంటల జర్నీ.. చైనా మాజీ పోలీస్...

Dong Gongping Escape | రబ్బరు బోటులో 30 గంటల జర్నీ.. చైనా మాజీ పోలీస్ సాహసం

చైనా ప్రభుత్వ కళ్ళు గప్పి, ఒక చిన్న రబ్బరు పడవలో ఏకంగా 30 గంటల పాటు సముద్రంపై ప్రాణాలకు తెగించి ప్రయాణించిన ఓ మాజీ పోలీసు అధికారి సాహసోపేత కథనం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Dong Gongping Escape | చైనా ప్రభుత్వ కళ్ళు గప్పి, ఒక చిన్న రబ్బరు పడవలో ఏకంగా 30 గంటల పాటు సముద్రంపై ప్రాణాలకు తెగించి ప్రయాణించిన ఓ మాజీ పోలీసు అధికారి సాహసోపేత కథనం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. స్వేచ్ఛ కోసం, తన కుటుంబాన్ని కలుసుకోవడం కోసం ఆయన చేసిన ఈ ‘డేరింగ్ జర్నీ’ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

Dong Gongping Escape | ఎవరీ డాంగ్ గాంగ్‌పింగ్?..

68 ఏళ్ల డాంగ్‌ గాంగ్‌పింగ్‌ చైనాలో ఒకప్పుడు పోలీసు అధికారిగా పనిచేశారు. 1989 నాటి చారిత్రాత్మక తియాన్‌మెన్ స్క్వేర్ అణచివేత ఘటన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా.. చైనా ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఆయన ఒక లేఖపై సంతకం చేశారు. దాంతో ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వ విధానాలపై నిరంతరాయంగా అసమ్మతి గళం వినిపించడంతో చైనా అధికారులు ఆయన్ను పలుమార్లు జైలులో పెట్టారు.

chaina.1

Dong Gongping Escape | స్వేచ్ఛ కోసం సుదీర్ఘ పోరాటం..

చైనాలో ఉంటే తనకు స్వేచ్ఛ దొరకదని భావించిన డాంగ్, 2015లో తన కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్‌కు పారిపోయారు. అక్కడ ఒక విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఆయన కుటుంబ సభ్యులకు కెనడా వెళ్లేందుకు అనుమతి లభించినప్పటికీ, డాంగ్‌ను మాత్రం థాయ్ అధికారులు తిరిగి చైనాకు పంపించేశారు (డిపోర్ట్ చేశారు). దాంతో చైనాలో ఆయనకు మళ్లీ జైలు శిక్ష తప్పలేదు. 2019లో జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా, కెనడాలో ఉన్న తన కుటుంబాన్ని చేరుకోవాలనే పట్టుదలను ఆయన వదులుకోలేదు.

Dong Gongping Escape | రబ్బరు పడవలో 30 గంటల డేరింగ్ జర్నీ..

ఇటీవల చైనా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించి మరోసారి పట్టుబడిన డాంగ్, ఆ తర్వాత విడుదలయ్యాక ఒక అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నారు. చైనాలోని వెయిహై తీరం నుండి ఒక చిన్న రబ్బరు బోటులో ఒంటరిగా సముద్రంలోకి బయల్దేరారు. ఎలాంటి రక్షణ లేని ఆ పడవపై దాదాపు 30 గంటల పాటు సముద్ర కెరటాలతో పోరాడుతూ ప్రయాణించి, ఎట్టకేలకు దక్షిణ కొరియా తీరానికి చేరుకున్నారు. తీరంలో అతడిని గమనించిన స్థానిక మత్స్యకారులు కోస్ట్ గార్డ్‌కు సమాచారం అందించడంతో అధికారులు ఆయన్ను ఆధీనంలోకి తీసుకున్నారు.

chaina.1

Dong Gongping Escape | దక్షిణ కొరియా నిర్ణయంపై ఉత్కంఠ..

ప్రస్తుతం డాంగ్ గాంగ్‌పింగ్ దక్షిణ కొరియా అధికారుల ఆధీనంలో ఉన్నారు. అయితే ఈ వ్యవహారం చైనా, దక్షిణ కొరియా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, కొరియా ప్రభుత్వం ఆయన్ను తిరిగి చైనాకు పంపించేసే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది.

కొన్నేళ్లుగా కేవలం స్వేచ్ఛ కోసం, తన భార్యాపిల్లలను కలుసుకోవడం కోసం డాంగ్ పోరాడుతున్నారని, దయచేసి ఆయన్ను మళ్లీ చైనాకు పంపొద్దని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు దక్షిణ కొరియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Paddy Procurement Protest | వడ్లు కొనడం లేదని సొసైటీకి తాళం వేసి నిరసన

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...

Hormuz Strait Blockade | హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత.. అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Blockade | వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం...