Telangana Airtel Data Centers | తెలంగాణలో డేటా సెంటర్ల విస్తరణ.. సీఎంతో భేటీ అయిన సునీల్ మిట్టల్

ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Airtel Data Centers | ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై సమగ్రంగా చర్చించారు.

Telangana Airtel Data Centers | భవిష్యత్ ప్రణాళికలు..

తెలంగాణలో డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సునీల్ మిట్టల్‌కు సీఎం సూచించారు. చందన్‌వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేయాలని, రాష్ట్రంలో మరింత పెద్ద సమగ్ర డేటా సెంటర్ , ఏఐ మౌలిక సదుపాయాల క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ, పెట్టుబడి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి , సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నామినేట్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

sunil.1

Telangana Airtel Data Centers | రాష్ట్రంలో విద్యా సంస్కరణల ప్రస్తావన..

తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల ప్రక్షాళన గురించి సీఎం వివరించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంచేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు చేశామని, ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ATC) మార్చామని, పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునీకరిస్తున్నామని తెలిపారు.

Telangana Airtel Data Centers | సునీల్ మిట్టల్ స్పందన..

హైదరాబాద్‌ను ఎయిర్‌టెల్‌కు రెండో ప్రధాన కార్యాలయంగా పరిగణిస్తున్నామని సునీల్ మిట్టల్ స్పష్టం చేశారు. భారతీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఏటీసీల్లో చదువుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని హామీ ఇచ్చారు. డేటా సెంటర్ల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు, తెలంగాణలో ఫైబర్ కనెక్టివిటీని విస్తరించేందుకు ఎయిర్‌టెల్ సిద్ధంగా ఉందని సునీల్ మిట్టల్ తెలిపారు.

ఇది కూడా చదవండి:  Yadagirigutta Temple | యాదగిరిగుట్టలో తిరుమల విధానం.. భూ కేటాయింపులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *