అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Attapur Bike Stunts | రీల్స్ కోసం బైక్‌తో స్టంట్స్ చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అత్తాపూర్‌లో పిల్లర్ నంబర్ 257 సమీపంలో మంగళవారం ముగ్గురు యువకులు బైక్‌లతో స్టంట్లు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.
పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు యువకులు నంబర్ ప్లేట్లు లేని హోండా డియో స్కూటర్లతో రోడ్డుపై స్టంట్స్ చేశారు. అత్తాపూర్ పెట్రోల్ కార్ ఇన్చార్జ్ కె. ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ ముగ్గురు యువకులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులను కాచిగూడ నెహ్రూ నగర్‌కు చెందిన మహ్మద్ మొహినుద్దీన్ అలియాస్ మొహిన్, యాకుత్‌పురాలోని నెహ్రూ నగర్‌కు చెందిన మహమ్మద్ రిజ్వాన్, కాచిగూడలోని సీఐబీ క్వార్టర్స్‌కు చెందిన తోహిద్గా గుర్తించారు.
Attapur Bike Stunts | బైక్‌లు ఇవ్వొద్దు
మైనర్లకు, డ్రైవింగ్ లైసెన్సులు లేని వ్యక్తులకు ద్విచక్ర వాహనాలను ఇవ్వవద్దని పోలీసులు తల్లిదండ్రులకు సూచించారు. లైక్‌లు, వ్యూస్ కోసం యువకులు ప్రమాదకరంగా రీల్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచాలన్నారు. ప్రమాదకర విన్యాసాలు చేస్తే వారిని హెచ్చరించాలని కోరారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్, సోషల్ మీడియా పర్యవేక్షణను ఉపయోగిస్తామని పోలీసులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Sandalwood Tilak | పూజల్లో గంధం ఎందుకు తప్పనిసరి?.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక ఆంతర్యం ఇదే..!