RTC Bus Accident | కంటైనర్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..: డ్రైవర్​కు గాయాలు..

ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్​ను ఢీకొంది. ఈ ఘటన భిక్కనూర్ మండలం జంగంపల్లి 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: RTC Bus Accident | ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్​ను ఢీకొంది. ఈ ఘటన భిక్కనూర్ మండలం జంగంపల్లి 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ప్రమాదంలో డ్రైవర్​కు గాయాలయ్యాయి.

RTC Bus Accidentv | అతివేగమే కారణమా..?

కామారెడ్డి (Kamareddy) నుంచి జేబీఎస్​ వెళ్తున్న ఎక్స్​ప్రెస్ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్​ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బస్సు ముందుబాగం ధ్వంసం కాగా బస్సు డ్రైవర్ బాలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని కామారెడ్డి జీజీహెచ్​కు తరలించారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Manala Mohan Reddy | బీఆర్‌ఎస్‌ చేసిన పాపాలే రాష్ట్రానికి శాపాలు : డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *