అక్షరటుడే వెబ్‌డెస్క్: CDSL IdeaThon 2.0 | ప్రపంచ పెట్టుబడిదారుల వారోత్సవాలు (World Investor Week 2026) సందర్భంగా సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ (CDSL) ‘రీఇమేజిన్ ఐడియాథాన్ 2.0’ను ప్రారంభించింది. ఆర్థిక అవగాహన , సైబర్ భద్రతను పెంపొందించే వినూత్న ఆలోచనలను అందించాలని భారతదేశంలోని ( India )విద్యార్థులను ఈ వేదిక ఆహ్వానిస్తోంది. ఈ పోటీలో విజేతలుగా నిలిచే టాప్-5 టీమ్‌లకు మొత్తం రూ. 11.5 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నారు.
CDSL IdeaThon 2.0 | పెరుగుతున్న సైబర్ మోసాలు ..
భారతదేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 23 కోట్లు దాటడంతో సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడిదారుల భాగస్వామ్యం భారీగా పెరిగింది. అయితే, అదే సమయంలో డిజిటల్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వ డేటా ప్రకారం 2025లో సైబర్ మోసాల వల్ల రూ. 22,495 కోట్లు నష్టపోగా, అందులో 76% నష్టాలు నకిలీ పెట్టుబడి , ట్రేడింగ్ కుంభకోణాల వల్లే జరిగాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు సరైన ఆర్థిక అవగాహన , డిజిటల్ భద్రత కల్పించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
CDSL IdeaThon 2.0 | యువత ఆలోచనలతో ..
ఈ ఐడియాథాన్ ద్వారా విద్యార్థులు మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్లు, చాట్‌బాట్‌లు, గేమ్‌లు, లెర్నింగ్ మోడ్యూల్స్ లేదా ఏఐ (AI) అసిస్టెంట్లు వంటి వివిధ రూపాల్లో తమ వినూత్న ఆలోచనలను సమర్పించవచ్చు. ప్రథమ శ్రేణి పెట్టుబడిదారులు , సీనియర్ సిటిజన్లకు సులభంగా అర్థమయ్యేలా వినూత్న పరిష్కారాలను అందించే యువతను ప్రోత్సహించడమే సీడీఎస్ఎల్ ప్రధాన ఉద్దేశం.
CDSL IdeaThon 2.0 | జ్యూరీ కమిటీ..
ఈ పోటీల కోసం ఏర్పాటు చేసిన జ్యూరీకి టీసీఎస్ (TCS) మాజీ సీఈఓ, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ ఎస్. రామదొరై అధ్యక్షత వహిస్తున్నారు. ఆవిష్కరణ, యూజర్ అనుభవం, ఉపయోగం, అమలు సాధ్యత, డేటా భద్రత వంటి వివిధ అంశాల ఆధారంగా ఈ జ్యూరీ విజేతలను ఎంపిక చేస్తుంది. అక్టోబర్ 7, 2026 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.
ఇది కూడా చదవండి: Modi Political Journey | మోదీ రాజకీయ ప్రస్థానం దేశాభివృద్ధికి సువర్ణాధ్యాయం