అక్షరటుడే వెబ్‌డెస్క్: IOAA 2026 | వియత్నాంలోని హనోయ్ వేదికగా జరిగిన 19వ అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర , ఖగోళ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ (IOAA 2026) లో కోటలోని ‘అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్’ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో అల్లెన్ విద్యార్థి ఆర్నవ్ సెహ్రావత్ స్వర్ణ పతకం సాధించగా, హర్షిిల్ పటేల్ రజత పతకం గెలుచుకున్నారు.
IOAA 2026 | భారత జెండా రెపరెపలు..
సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 5 వరకు జరిగిన ఈ టోర్నమెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా 64 దేశాల జట్లు పాల్గొన్నాయి. భారతదేశం ( India ) తరఫున ప్రాతినిధ్యం వహించిన 5 గురు సభ్యుల బృందం మొత్తం 4 స్వర్ణాలు, 1 రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఇందులో అల్లెన్ విద్యార్థులు రెండు పతకాలు సాధించడం విశేషం. విద్యార్థుల విజయంపై అలెన్ ప్రెసిడెంట్ వినోద్ కుమావత్ హర్షం వ్యక్తం చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో భారత్ కీర్తిని విద్యార్థులు మరోసారి ఇనుమడింపజేశారని కొనియాడారు.
ఈ ఏడాది (2026) ఇప్పటివరకు వివిధ అధికారిక ఒలింపియాడ్స్‌లో అల్లెన్ విద్యార్థులు మొత్తం 15 పతకాలు (11 స్వర్ణాలు, 4 రజతాలు) సాధించారు. అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో 4 గోల్డ్ మెడల్స్, కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో 3 గోల్డ్ మెడల్స్, అస్ట్రానమీలో 1 గోల్డ్ , 1 సిల్వర్, ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్‌లో 3 గోల్డ్ , 2 సిల్వర్ మెడల్స్, అలాగే బయాలజీ ఒలింపియాడ్‌లో 1 సిల్వర్ మెడల్‌ను అలెన్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు.
IOAA 2026 | భవిష్యత్తు లక్ష్యాలు..
దేశం తరఫున స్వర్ణ పతకం సాధించడం గర్వకారణంగా ఉందని ఆర్నవ్ సెహ్రావత్ తెలిపారు. వివిధ దేశాల విద్యార్థులతో పోటీ పడటం ద్వారా ఎంతో నేర్చుకున్నానని, భవిష్యత్తులో సైన్స్ రంగంలో మరింత ముందుకు వెళ్లేందుకు ఈ విజయం స్ఫూర్తినిస్తుందన్నారు. మరోవైపు రజత పతకం సాధించిన హర్షిత్ పటేల్ మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడటం అద్భుతమైన అనుభవమని, భవిష్యత్తులో ఐఐటీయన్ కావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
IOAA 2026 | కఠినమైన ఎంపిక ప్రక్రియ..
ఈ అంతర్జాతీయ పోటీల కోసం IOAA నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది. మొదటి దశ (NSEA) లో అలెన్ నుంచి 143 మంది ఎంపికవ్వగా, రెండో దశ (INAO) లో 23 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మూడో దశ అయిన ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ (OCSC) ద్వారా భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించే 5 గురు సభ్యుల తుది జట్టును ఎంపిక చేశారు. ఆ తర్వాత నాల్గవ , చివరి దశ అయిన 19వ IOAA 2026 ఫైనల్స్ వియత్నాంలోని హనోయ్‌లో విజయవంతంగా ముగిశాయి.
ఇది కూడా చదవండి: Modi Political Journey | మోదీ రాజకీయ ప్రస్థానం దేశాభివృద్ధికి సువర్ణాధ్యాయం