Dr Swapna Shanbhag| ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో డాక్టర్ స్వప్న షణ్భాగ్

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రముఖ ‘మ్యాక్సివిజన్ సూపర్‌ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి’కి చెందిన ప్రముఖ కార్నియా, కటరాక్ట్ , రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ స్వప్న షణ్భాగ్ అరుదైన ఘనత సాధించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Dr Swapna Shanbhag | హైదరాబాద్‌లోని  ( Hyderabad ) మాదాపూర్‌లో ప్రముఖ ‘మ్యాక్సివిజన్ సూపర్‌ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి’కి చెందిన ప్రముఖ కార్నియా, కటరాక్ట్ , రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ స్వప్న షణ్భాగ్ అరుదైన ఘనత సాధించారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ-ఎల్సేవియర్ (Stanford University–Elsevier) ప్రకటించిన ప్రపంచంలోని అత్యుత్తమ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో ఆమె ఆప్తాల్మాలజీ విభాగంలో వరుసగా మూడో ఏడాది చోటు దక్కించుకున్నారు.

Dr Swapna Shanbhag | వైద్య పరిశోధనలకు ..

కంటి వైద్య రంగంలో డాక్టర్ స్వప్న షణ్భాగ్ అందిస్తున్న నిరంతర పరిశోధనలకు, సేవలకు ఈ గుర్తింపు నిదర్శనంగా నిలుస్తుంది. కేవలం క్లినికల్ ప్రాక్టీస్‌కే పరిమితం కాకుండా, కంటి సంబంధిత సమస్యలపై అవగాహన కల్పిస్తూ మెరుగైన చికిత్స విధానాలపై ఆమె చేస్తున్న రీసెర్చ్ వైద్య రంగానికి ఎంతగానో దోహదపడుతోంది.

Dr Swapna Shanbhag | ఆసుపత్రికి తలమానికం..

వరుసగా మూడేళ్లపాటు ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తల జాబితాలో స్థానం సంపాదించడం ద్వారా ఆమె వృత్తిపరమైన ప్రతిభ మరోసారి నిరూపితమైంది. ఈ వేదికగా మ్యాక్సివిజన్ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యాన్ని, పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఈ ఘనత మరింత చాటిచెబుతోంది.

ఇది కూడా చదవండి:  Vangaveeti Radha | జనసేనలో చేరిన వంగవీటి రాధా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *