Utthana Ekadashi 2026 | నవంబర్ 20న దేవుత్తని ఏకాదశి.. ఈ నియమాలు పాటిస్తే అష్టైశ్వర్యాలే

పురాణాల ప్రకారం కార్తీకమాసం ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటారని విశ్వాసం.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Utthana Ekadashi 2026 | పురాణాల ప్రకారం కార్తీకమాసం ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు ( Vishnu )యోగనిద్ర నుంచి మేల్కొంటారని విశ్వాసం. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రలోకి వెళ్లిన స్వామివారు.. కార్తీక శుద్ధ ఏకాదశి (ప్రబోధిని లేదా దేవుత్తని ఏకాదశి) రోజున మేల్కొంటారని పండితులు చెబుతున్నారు. ఈసారి నవంబర్ 20న ఈ పవిత్ర తిథి వచ్చింది. స్వామివారు మేల్కొనడంతోనే హిందూ సంప్రదాయంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతాయి.

 తిథి సమయాలు..
కార్తీకమాసం శుద్ధ ఏకాదశి తిథి నవంబర్ 20 ఉదయం 07:15 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 21 ఉదయం 06:31 గంటల వరకు కొనసాగుతుంది.

Utthana Ekadashi 2026 | విశిష్టత, పూజా విధానం..

కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. క్షీరాబ్ధి యోగంతో కూడిన ఈ రోజున భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజించి, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శ్రేయస్కరమని భక్తులు నమ్ముతారు. సాలగ్రామ స్వరూపమైన శ్రీహరితో తులసి మొక్కకు వివాహం (తులసి కల్యాణం) జరిపించడం ఈ రోజు ప్రత్యేకత. అన్నదానం, వస్త్రదానం వంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు, వైకుంఠ ప్రాప్తి కలుగుతాయని భక్తుల విశ్వాసం.

Utthana Ekadashi 2026 | పాటించాల్సిన నియమాలు…

ఉత్థాన ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి, ఉపవాస దీక్ష ప్రారంభించాలి. వీలును బట్టి నదీస్నానం ఆచరిస్తే మంచిది. శ్రీ మహావిష్ణువుకు తెల్లని నైవేద్యాలు అంటే ప్రీతి కాబట్టి ఖీర్ లేదా తెలుపు రంగు మిఠాయిలు సమర్పించడం శుభప్రదం. ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాసం, జాగరణ పాటిస్తూ రోజంతా హరినామస్మరణలో గడపాలి. అలాగే పెద్దలు, వృద్ధులకు సాయం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

Utthana Ekadashi 2026 | చేయకూడని పనులు..

ఏకాదశి రోజున అన్నం తినకూడదు. వ్రతం చేసేవారు ముందు రోజు సాయంత్రం నుంచే అన్నం మానేయడం మంచిది. ఇంట్లో గానీ, బయట గానీ ఎవరితోనూ గొడవలు, కోపాలు, ద్వేషాలకు తావివ్వకూడదు. అబద్ధాలు చెప్పడం, మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ రోజున తులసి మొక్కను పూజించడం మర్చిపోకూడదు.

ఇది కూడా చదవండి: EPFO PF Withdrawal Rules | పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. విత్‌డ్రా నిబంధనల్లో కీలక మార్పులు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *