EPFO PF Withdrawal Rules | పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. విత్‌డ్రా నిబంధనల్లో కీలక మార్పులు..

అత్యవసర సమయాల్లో తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) సొమ్ము కోసం ఎదురుచూసే ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ (EPFO) భారీ ఊరటనిచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: EPFO PF Withdrawal Rules | అత్యవసర సమయాల్లో తమ ప్రావిడెంట్ ఫండ్ ( Provident Fund ) సొమ్ము కోసం ఎదురుచూసే ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ (EPFO) భారీ ఊరటనిచ్చింది. పదవీ విరమణకు ముందే ఖాతాదారులు తమ పీఎఫ్ నిధులను మరింత సులభంగా, వేగంగా వినియోగించుకునేలా విత్‌డ్రా నిబంధనలను సవరించింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఉద్యోగులకు తమ సొంత నిధిపై మరింత వెసులుబాటు కల్పించేలా ఈ కొత్త రూల్స్‌ను రూపొందించారు.

EPFO PF Withdrawal Rules | 90 శాతం విత్‌డ్రా..

సవరించిన నిబంధనల ప్రకారం.. 55 ఏళ్ల లోపు వయసున్న ఖాతాదారులు తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌లో ఏకంగా 90 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. గతంలో ఈ పరిమితి 75 శాతం మాత్రమే ఉండేది. అలాగే నిరుద్యోగ సమయంలో డబ్బు తీసుకునే నిబంధనలోనూ పెద్ద మార్పు చేశారు. ఇంతకుముందు ఉద్యోగం కోల్పోయిన తర్వాత 12 నెలల పాటు వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కేవలం 2 నెలలు పూర్తయితే చాలు నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు.

EPFO PF Withdrawal Rules | మూడు ప్రధాన విభాగాలుగా ..

రిటైర్మెంట్ పొదుపు పూర్తిగా ఖాళీ కాకుండా తగిన రక్షణ నిబంధనలను కొనసాగిస్తూనే, 2026 ఈపీఎఫ్ పథకం కింద విత్‌డ్రా కారణాలను ముఖ్య అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు. వీటిలో ముఖ్య అవసరాల కింద వైద్య చికిత్సలు, పిల్లల విద్య, వివాహ ఖర్చులకు. గృహ అవసరాల కింద ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు, స్థలం కొనడం, ఇంటి నిర్మాణం, గృహ రుణ (Home Loan) చెల్లింపులు, ఇంటి మరమ్మతులకు నిధులు తీసుకోవచ్చు. అలాగే ప్రత్యేక పరిస్థితుల విభాగంలో ఇతర ఊహించని ఆర్థిక అవసరాలకు పీఎఫ్ సొమ్మును ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు.

EPFO PF Withdrawal Rules | సులభతరమైన ఆన్‌లైన్ ప్రక్రియ..

నిర్దేశిత అర్హత షరతులు, విత్‌డ్రా పరిమితులకు లోబడి ఖాతాదారులు తమ అర్హత కలిగిన బ్యాలెన్స్ నుంచి ఈ మొత్తాన్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా క్లెయిమ్ చేసుకునే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను కూడా గతంతో పోలిస్తే మరింత సరళతరం చేశారు.

ఇది కూడా చదవండి:  Nizamabad Police Services | ప్రజలకు మెరుగైన సేవలందించాలి : డీఐజీ నారాయణ నాయక్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *