Nizamabad Police Services | ప్రజలకు మెరుగైన సేవలందించాలి : డీఐజీ నారాయణ నాయక్​

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో ప్రజలకు పోలీసుశాఖ తరపున మెరుగైన సేవలందించాలని డీఐజీ నారాయణ నాయక్​ (బాసర జోన్​–2) అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Police Services | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో ప్రజలకు పోలీసుశాఖ తరపున మెరుగైన సేవలందించాలని డీఐజీ నారాయణ నాయక్​ (బాసర జోన్​–2) అన్నారు. గురువారం నగరంలోని (Nizamabad) 1వ టౌన్​ పోలీస్​స్టేషన్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీపీ సాయిచైతన్య ఆయకు స్వాగతం పలికారు.

Nizamabad Police Services | స్టేషన్​లో రికార్డుల పరిశీలన..

స్టేషన్​లోని రికార్డులను నారాయణ నాయక్​ క్షుణ్ణంగా పరిశీలించారు. నమోదైన కేసులు వాటి పరిష్కారాలను తెలుసుకున్నారు. సైబర్​ క్రైం కేసులపై త్వరితగతిన స్పందించాలని.. స్టేషన్​ పరిధిలో సున్నితమైన ప్రాంతాలు ఉన్నందున 24గంటలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ట, గౌరవం మరింత పెరిగే విధంగా అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు.

కేసుల దర్యాప్తును నిర్ణీత సమయంలో పూర్తి చేసి, న్యాయస్థానాల్లో త్వరితగతిన ఛార్జిషీట్​లు దాఖలు చేయాలన్నారు. ప్రతి పోలీస్ సిబ్బంది చట్టాలు, నూతన నేర న్యాయ చట్టాలు, పోలీస్ విధివిధానాలు, సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. డయల్ 112పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని..సిబ్బంది క్రమశిక్షణలో ఉండాలని సూచించారు.

ఇది కూడా చదవండి: సాగర్ లో ఏపీ సొరంగ పనులపై.. 9నెలలు మౌనం.. ఇప్పుడు ఆపుతారంట..!! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *