అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: MLA Dhanpal | నిజామాబాద్ నగరంలో(Nizamabad) బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మినీ ట్యాంక్‌బండ్ వద్ద బొడ్డెమ్మ చెరువు పరిసరాల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు.
MLA Dhanpal | బతుకమ్మలను ఎత్తుకుని.. మహిళలతో మాట్లాడుతూ..
బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే మినీ ట్యాంక్ బండ్‌ను సందర్శించారు. అక్కడ మహిళలతో సౌకర్యాలపై మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ ఎంతగా అంతర్లీనంగా ఉందో తెలియజేశారు. వారు తీసుకొచ్చిన బతుకమ్మలను ఎత్తుకున్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఎన్హెచ్ఎం ఉద్యోగుల జీతాలు తగ్గించడం అన్యాయం