Bathukamma Security | బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

మహిళల భద్రతకు , బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు

Naresh Chandan

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bathukamma Security | నిజామాబాద్ Nizamabad పోలీస్ కమిషనరేట్ పరిధిలో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు.

నిజామాబాద్ డివిజన్ పరిధిలోని ఖిల్లా చౌరస్తా లోని బొడ్డమ్మ చెరువు, పులాంగ్ బ్రిడ్జి వద్ద, కంటేశ్వర్ దేవాలయం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన భద్రతా చర్యలను, బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పరిశీలించారు.

Bathukamma Security |

ఉత్సవ ప్రాంతాల్లో మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా , వేడుకలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు. బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే మహిళలు, చిన్నారులు, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, రద్దీని సమర్థవంతంగా నియంత్రించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఉత్సవ ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Vishwak Sen Cult trailer | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ట్రైలర్.. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ తో వస్తున్న ఇండియాస్ ఫస్ట్ ‘స్లాషర్’ ఫిల్మ్!

ప్రజలు సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకొనేలా , మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిజామాబాద్ పోలీస్ శాఖ అన్ని అవసరమైన చర్యలు చేపడుతోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీలు, సీఐలు ఎస్సైలు, షీ టీమ్ బృందాలు, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు బందోబస్తులో పాల్గొన్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *