అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad Transport Department | సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోపై సమగ్ర విచారణ చేపడుతున్నట్లు నిజామాబాద్ Nizamabad జిల్లా రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారు? దానికి రవాణాశాఖతో ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల తెలిపారు.
వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది మాస్కులు ధరించి కనిపిస్తున్న నేపథ్యంలో.. అది 2020–2022 మధ్య కొవిడ్-19 కాలానికి సంబంధించినదై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, వీడియో చిత్రీకరణకు సంబంధించిన తేదీ, ప్రదేశం, సందర్భంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు.
Nizamabad Transport Department | ఇద్దరు హోంగార్డులపై చర్యలు
ఈ నెల 17న ఇద్దరు హోంగార్డులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వారిని వారి మాతృశాఖకు సరెండర్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకు, హోంగార్డులపై తీసుకున్న చర్యలకు ఏదైనా సంబంధం ఉందా.. అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు నివేదిక కోరిన నేపథ్యంలో వీడియో మూలం, కాలం, సందర్భం, రవాణాశాఖతో దాని సంబంధంపై వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. విచారణలో వెల్లడయ్యే వాస్తవాల ఆధారంగా నివేదిక సమర్పించి, తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Nizamabad Transport Department | అవినీతిపై కఠిన చర్యలు
రవాణాశాఖలో ఎవరైనా అవినీతి, ఇతర అక్రమాలకు పాల్పడినట్లు విశ్వసనీయమైన సమాచారం, ఆధారాలు లభిస్తే వాటిని సమగ్రంగా పరిశీలిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఆరోపణలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Nizamabad Transport Department | నిరాధార ప్రచారం చేయొద్దు
వైరల్ వీడియోకు సంబంధించి వాస్తవాలు నిర్ధారించుకోకుండా నిరాధార సమాచారాన్ని ప్రచారం చేయొద్దని మీడియా ప్రతినిధులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రవాణాశాఖలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలకు సంబంధించి ఎవరి వద్దనైనా విశ్వసనీయమైన ఆధారాలు ఉంటే సంబంధిత అధికారులకు అందజేయాలని కోరారు.
ఆధారాలతో వచ్చే ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, వాస్తవాల ఆధారంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ స్పష్టం చేశారు.