Gram Panchayat Buildings | ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం : మంత్రి సీతక్క

ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం నిర్మిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gram Panchayat Buildings | ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం నిర్మిస్తామని మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. ప్రస్తుతం 5,118 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవన్నారు.

ఆయా గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.1,000 కోట్ల నిధులను మంజూరు చేసిందని సీతక్క తెలిపారు. ఇప్పటికే 3,269 గ్రామ పంచాయతీ భవనాల పనులు 70 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. శనివారం ఆమె ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ (Medak) జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Gram Panchayat Buildings | మహిళా సంఘాల భవనాలు

రాష్ట్రంలోని 8 వేల గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలను నిర్మిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇందుకోసం రూ.800 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. సొంత భవనాలు అందుబాటులోకి వస్తే మహిళలు తమ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో హ్యామ్​ విధానంలో గ్రామీణ రహదారులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు హ్యామ్​  (HAM) రోడ్ల పనులను నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు.

Gram Panchayat Buildings | సింగూరు నీటిపై..

ఎల్‌నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నాలుగు జిల్లాల్లోని 19 రిజర్వాయర్లలో నీటి మట్టాలపై ఆరా తీశారు. సింగూరు మినహా మిగిలిన రిజర్వాయర్లలో తగినంత నిల్వలు ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. సింగూరు డ్యామ్​లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందునా ప్రత్యేక అధికారిని నియమించి తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : CDPO Caught by ACB | అంగన్​వాడీ కేంద్రాల నుంచి లంచం.. ఏసీబీకి చిక్కిన సీడీపీవో

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *