అక్షరటుడే, కామారెడ్డి: Red Cross Elections Kamareddy | ఇండియన్ రెడ్‌క్రాస్ (Red Cross) సొసైటీ కామారెడ్డి (Kamareddy) బ్రాంచ్ ఎన్నికలు శనివారం ముగిశాయి. ఈనెల 24వ తేదీన 15 మంది కమిటీ సభ్యులకు గాను 31 నామినేషన్లు దాఖలయ్యాయి.
Red Cross Elections Kamareddy | 16మంది నామినేషన్ల ఉపసంహరణ..
25వ తేదీన నామినేషన్ల పరిశీలనలో అన్నీ ఆమోదం పొందాయి. శనివారం ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా 16 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మిగిలిన 15 మంది కమిటీ డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పి.రామమోహన్, డిప్యూటీ ఎన్నికల అధికారి టి.ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో ముక్కెర సంజీవ రెడ్డి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవికి జరిగిన పోటీలో గోనేకర్ దస్తీరాం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
కోశాధికారి పదవికి గడ్డం రమేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముస్కు జైపాల్ రెడ్డి రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మిగిలిన 11మంది అమృత దత్తాత్రి, గోవర్ధన్ గార్దాస్, జోషి శ్రీధర్, కృష్ణ మనేటి, కుసుమ శ్రీకాంత్ కుమార్, మర్రి సదాశివ రెడ్డి, నాగరాజు గౌడ్ అంకన్నగారి, నారాల వెంకట్ రెడ్డి, ఎన్. బాల్ చంద్రం, పాడియార్ కిరణ్, రాజన్న మరవేనిలు రెడ్‌క్రాస్ సొసైటీ కామారెడ్డి బ్రాంచ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: మోహన్ బాబుతో పనిచేయడం నా లైఫ్‌టైం అచీవ్మెంట్.. – ది ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల