అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hotels Inspection | హైదరాబాద్ (Hyderabad) నగరంతో పాటు రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారులు దాడులు చేశారు. పరిశుభ్రత పాటించని యజమానులపై చర్యలు తీసుకున్నారు. 11 రెస్టారెంట్ల లైసెన్స్‌లు రద్దు చేశారు.
రెస్టారెంట్లలో తనిఖీల సమయంలో అధికారులు గడువు ముగిసిన మాంసం, పునర్వినియోగించిన నూనె వాడుతున్నట్లు గుర్తించారు. మాదాపూర్‌లోని మొనాస్టరీ ఆంఫీ బ్రూవరీ, వరంగల్ నగరంలోని ఆల్ఫారమ్ హోటల్, కామారెడ్డిలోని మాల్గుడి రెస్టారెంట్లలో తనిఖీల సందర్భంగా పలు లోపాలు బయటపడ్డాయి. గడువు ముగిసిన పచ్చి మాంసం, ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన వండిన ఆహారం, సుమారు 5 కిలోల పునర్వినియోగించిన వంట నూనె, రిఫ్రిజిరేటర్లలో లేబుల్ లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేనసుకున్నారు.
Hotels Inspection | కంపు కొడుతున్న కిచెన్లు
పలు హాటళ్లలో కిచెన్లు కంపుకొడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రముఖ హోటళ్ల కిచెన్లలో సైతం నిబంధనలు పాటించడం లేదు. కీటకాలు, ఎలుకలు తిరుగుతున్నాయి. అపరిశుభ్రమైన వంటగది, జిడ్డు గోడలు, పాడైపోయిన కూరగాయలు, వారం రోజుల కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పలు హోటళ్ల లైసెన్స్‌లు రద్దు చేయగా.. మరికొన్నింటికి నోటీసులు ఇచ్చారు.
Hotels Inspection | లైసెన్స్‌లు రద్దు చేసిన హోటళ్లు
హైటెక్ సిటీలోని మొనాస్టరీ, గచ్చిబౌలిలోని ప్రియాంక హాస్పిటాలిటీ సర్వీసెస్ (శివానీ ది రెస్టారెంట్ అండ్ బార్), అల్ సబా రెస్టారెంట్, మాదాపూర్‌లోని లక్కీ మల్టీక్యూజిన్ రెస్టారెంట్ లైసెన్స్‌లను అధికారులు రద్దు చేశారు. అలాగే మాదాపూర్‌లోని సాయి రామ్ మెస్, చ్చిబౌలిలోని ఉడుపిస్ ఉపహార్, హైటెక్ సిటీలోని కోల్ స్పార్క్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, హెచ్. క్కొంకా ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్, గచ్చిబౌలిలోని అంతేరా హాస్పిటాలిటీ, జె ఓనమౌ ఫుడ్ అండ్ బెవరేజెస్, మాదాపూర్‌లోని ఫ్యూజన్ 9 / ఆమ్నీషియా స్కై బార్ లైసెన్స్‌లను రద్దు చేశారు.
దీనిని కూడా చదవండి : Gram Panchayat Buildings | ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం : మంత్రి సీతక్క