అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR 22-A Ban List | పేదల సొమ్ము దోచుకోవాలని 22-A నిషేధిత జాబితాలో లక్షలాది ఎకరాలు చేర్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) 30 శాతం కమీషన్ కోసం పేద ప్రజలను హింసించడం ఆపాలని కేటీఆర్ అన్నారు. తమను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశాక, హరీష్ రావు తెలంగాణ భవన్లో బాధితులను కలిసి అన్ని ఆధారాలు బయటపెట్టారని చెప్పారు. అయినా కూడా మంత్రి పొంగులేటి మా అధికారులు తప్పు చేశారని సారీ అని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసింది అధికారులు కాదని, తప్పు చేసింది రేవంత్ రెడ్డి, పొంగులేటి అని ఆరోపించారు. నిషేధిత జాబితాలో పెట్టిన ప్రజల ఆస్తులను వెంటనే తొలగించి, బాధితులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
KTR 22-A Ban List | భూ హారతి
ధరణి రక్షణ కంచేలా ఉండేదని, యజమాని వేలు పెడితేనే ఆ ఆస్తి వివరాలు వచ్చేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వతం తెచ్చిన పోర్టల్ భూ భారతి కాదు భూ హారతి అన్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని, నిషేధిత జాబితాలో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాపర్టీ ఓనర్లకు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని ఆరోపించారు. వెంటనే యథాతథ స్థితిని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
KTR 22-A Ban List | క్షీణిస్తున్న శాంతిభద్రతలు
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇంటి మీదకి గూండాలను పంపారని, పోలీస్ స్టేషన్లో తమపై దాడికి గూండాలను ఉసిగొల్పారని ఆయన ఆరోపించారు. తన సిబ్బంది మీద పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ గూండాలు దాడి చేశారన్నారు.
KTR 22-A Ban List | ఎవరిని వదిలిపెట్టం
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేసి, వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. అసైన్డ్ భూములకు పట్టాలిచ్చే పేరుతో ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకున్నారనే అనుమానం ఉందన్నారు. రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకం వెనుక ఉన్న అక్రమాలు భవిష్యత్తులో బయటపడతాయని తెలిపారు. రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, తప్పు చేసిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు.
కేసీఆర్ గారి ఇంటి మీదకు వేలమంది గూండాలను పంపించారు.
మేము అక్కడికి వెళ్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు.
అక్కడికి కూడా మా మీదకు గూండాలను ఉసిగొల్పారు.నిన్న నా సిబ్బందిని పోలీస్ స్టేషన్కు పిలిపించి,
పోలీస్ స్టేషన్లో వారి మీద కాంగ్రెస్ గూండాలతో దాడికి… pic.twitter.com/KQLCMog3XQ— BRS Party (@BRSparty) September 15, 2026
దీనిని కూడా చదవండి : Rajiv Yuva Vikas | సర్కార్ కీలక నిర్ణయం.. నవంబర్ 19 నుంచి రూ.లక్ష ఆర్థిక సాయం