అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyclone Arnab | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రేపు తుపాన్‌గా మారనుంది. అనంతరం తీవ్రమైన సైక్లోన్‌గా బలపడి ఈ నెల 28న తీరం దాటే అవకాశం ఉంది.
అల్పపీడన (LPA) ప్రభావంతో రాష్ట్రంలో చలిగాలులు వీస్తున్నాయి. ఇది తుపాన్‌గా మారిన అనంతరం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుపాన్‌కు అర్నాబ్ అని పేరు పెట్టారు. అక్టోబర్ 28న ఏపీలోని పెరుపాలెం, కోనసీమ మధ్యగా వెళ్లే అవకాశం ఉంది. దీంతో ప్రభావంతో 28న ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ, భూపాలపల్లి, భువనగిరి, జనగామ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయి.
Cyclone Arnab | నవంబర్ 4 వరకు..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో వర్షాలు పడితే పంటలకు మేలు చేస్తుంది. అయితే గాలివాన కురిస్తే పంటలు నేలవాలే అవకాశం ఉంది. మరోవైపు పలు ప్రాంతాల్లో వరికోతలు జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో వాన పడితే ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Chandrapur Tiger Capture | బోనులో చిక్కిన పెద్దపులి.. ఐదు గ్రామాల ప్రజలకు ఊరట