అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Police Martyrs | పోలీస్ అమరవీరుల త్యాగాలు (Nizamabad Police) వెలకట్టలేనివి డీసీపీ(అడ్మిన్) శుభం ప్రకాశ్ పేర్కొన్నారు. పోలీసు అమరవీరు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
Nizamabad Police Martyrs | ర్యాలీని ప్రారంభించిన డీసీపీ
పోలీస్ ప్లాగ్డేను పురస్కరించుకుని బైక్ ర్యాలీని డీసీపీ(అడ్మిన్) శుభం ప్రకాశ్ ప్రారంభించారు. పూలాంగ్ చౌరస్తా నుండి ప్రారంభమై ఈ ర్యాలీ ప్రగతి హాస్పిటల్, ఎల్ఐసీ చౌరస్తా, కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు సాగింది. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎందరో పోలీస్ సిబ్బంది నక్సలైట్లు, మతపరమైన విభజన శక్తులు, ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోంటూ విధి నిర్వహణలో వీర మరణం పొందారన్నారు మాదక ద్రవ్యాలను రవాణాను నిలువరించేందుకు.. మహిళ భద్రతకు, తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. వీరి త్యాగాల వల్లే ఈరోజు దేశం సంతోషంగా ఉందన్నారు.
Nizamabad Police Martyrs | సమాచారం అందించాలి
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చూడాలని, ఎక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా పోలీసు కుటుంబాలను పరామర్శించినట్లు తెలిపారు. ఈ దేశం కోసం న్యాయం కోసం.. ఎప్పటికీ తలవంచకుండా పక్షపాతం లేకుండా సేవ చేయడానికి మన హృదయలతో ప్రమాణం చేద్దామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్లో లోయలో పడిన బస్సు..