Bichkunda Theft Case | వృద్ధురాలి ఇంట్లో చోరీ.. ముగ్గురు అరెస్ట్

తాళంవేసి ఉన్న ఓ వృద్ధురాలి ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురిని బిచ్కుంద పోలీసులు అరెస్ట్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Bichkunda Theft Case | తాళం వేసి ఉన్న ఓ వృద్ధురాలి ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురిని బిచ్కుంద పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బిచ్కుంద ఎస్సై రాజు మీడియాకు వివరాలు వెల్లడించారు.

Bichkunda Theft Case | బంధువుల ఇంటికి వెళ్లగా..

బిచ్కుంద (Bichkunda) గ్రామానికి చెందిన సుంకరి సాయవ్వ ఈ నెల 14న బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్లారు. ఇంటికి తాళం ఉండటాన్ని గమనించిన నిందితులు ఈనెల 18వ తేదీ అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, పెట్టెలో దాచిన రూ.15 వేల నగదును అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల పరిశీలన, స్థానిక సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

శుక్రవారం సాయంత్రం బిచ్కుంద పోలీసులు రాజూళ్ల చౌరస్తా, పరమేశ్వర థియేటర్ సమీపంలో గస్తీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు చోరీకి పాల్పడినట్లు వెల్లడైంది. అరెస్టయిన నిందితులు బాన్సువాడకు చెందిన దాసరి తిరుపతి, బిచ్కుందకు చెందిన చౌహాన్ అర్జున్, చౌహాన్ సురేష్ గా గుర్తించారు. నిందితులు మద్యానికి అలవాటుపడి డబ్బుల కోసం చోరీకి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. వారి వద్ద నుంచి చోరీకి ఉపయోగించిన ఇనుప రాడ్ తో పాటు చోరీ చేసిన నగదులో మిగిలిన రూ.12వేలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Minor Assault Case | యువతిపై ఇద్దరు మైనర్ల దాడి.. పోలీసులకు అప్పగించిన స్థానికులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *