MeeSeva Urea Booking | రైతుల సౌకర్యార్థం.. మీసేవ ద్వారా సైతం యూరియా బుకింగ్

రైతులకు సబ్సిడీ యూరియాను సులభంగా బుక్ చేసుకునేందుకు ప్రభుత్వం కొత్త మార్గాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: MeeSeva Urea Booking | రైతులకు సబ్సిడీ యూరియాను సులభంగా బుక్ చేసుకునేందుకు ప్రభుత్వం కొత్త మార్గాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మీసేవ కేంద్రాల ద్వారా కూడా యూరియా (Urea)ను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

MeeSeva Urea Booking | యూరియా యాప్​తో రైతుల అవస్థల నేపథ్యంలో..

గతంలో రైతులు యూరియా కోసం యాప్ లోనే బుక్ చేసుకోవాల్సి ఉండేది. స్మార్ట్ ఫోన్ లేని, టెక్నాలజీ తెలియని రైతులు ఇబ్బంది పడేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీసేవ కేంద్రాల్లో బుకింగ్ సదుపాయం కల్పించారు. రైతు తమ పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డ్​తో మీసేవ కేంద్రానికి వెళ్లాలి. కేంద్రంలోని ఆపరేటర్ రైతు పొలం విస్తీర్ణం, పంట వివరాలు నమోదు చేస్తారు. ఎంత యూరియా అవసరమో సిస్టమ్ లెక్కించి బుకింగ్ చేస్తుంది. బుకింగ్ అయిన తర్వాత రైతు మొబైల్​కు ఓటీపీ వస్తుంది. యూరియా వచ్చినప్పుడు ఆ OTP చూపించి గోదాం/డీలర్ వద్ద నుండి తీసుకోవాలి.

MeeSeva Urea Booking | రైతులకు వెసులుబాటు..

MeeSeva Urea Booking

యూరియా యాప్ రాని రైతులకు ఈ సౌకర్యం మేలు చేయనుంది. దళారులు మధ్యలో దూరే అవకాశం లేదు. అవసరానికి మించి బుకింగ్ చేసే అవకాశం కూడా ఇందులో ఉండదు. భూమి విస్తీర్ణం ఆధారంగా మాత్రమే యూరియా కేటాయింపు జరుగుతుంది. గడువులోగా రైతులు ఎంపిక చేసిన ఎరువుల డీలర్ వద్ద నుండి యూరియాను తీసుకోవాలి. ఈ కొత్త విధానం ద్వారా రైతులు క్యూ లైన్లలో నిలబడే ఇబ్బంది తప్పుతుంది. సకాలంలో సబ్సిడీ ఎరువులు అందే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Meat Shop Hygiene | మాంసం దుకాణాదారులు పరిశుభ్రత పాటించాలి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *