అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gurukul Food Poisoning | నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool District) అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం విద్యార్థులు టిఫిన్ చేశారు. అనంతరం 26 మంది అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో సిబ్బంది వారిని వెంటనే మన్ననూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేశారు. అయితే ఆ ఆస్పత్రిలో బెడ్లు సరిపోకపోవడంతో విద్యార్థులను నేలపై పడుకొబెట్టి చికిత్స చేశారు. అనంతరం వారిని అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు.
Gurukul Food Poisoning | నిలకడగా ఆరోగ్యం
అల్పాహారం చేసిన కొద్దిసేపటికే, విద్యార్థులకు విరేచనాల లక్షణాలు కనిపించి, తీవ్ర అస్వస్థతకు గురయ్యారని పాఠశాల సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతుందన్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పాఠశాలలు పున:ప్రారంభమై ఇంకా నెల రోజులు కూడా కావడం లేదు. అప్పుడే రెండు పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కావడం ఆందోళన కలిగిస్తోంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. రాత్రి భోజనం అనంతరం సుమారు 20 మంది విద్యార్థులు విరోచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు.
Gurukul Food Poisoning | తల్లిదండ్రుల ఆందోళన
గురుకుల పాఠశాల్లోల 6వ తరగతి నుంచి విద్యార్థులు ఉంటారు. తల్లిదండ్రులు ప్రభుత్వంపై నమ్మకంతో తమ పిల్లలను బడిలో చేర్పిస్తున్నారు. అయితే ఫుడ్ పాయిజన్ ఘటనలు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. తమ పిల్లలు ఏం తింటున్నారో.. ఎలా ఉంటున్నారో అని వారు ఆందోళన చెందుతున్నారు. అసలే వర్షాకాలం.. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారం తిన్న 26 మంది విద్యార్థులకు అస్వస్థత గురికావడంతో చికిత్స నిమిత్తం సిబ్బంది అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు.#Nagarkurnool:… pic.twitter.com/oEFUDR4FLs
— Akshara Today | Telugu News (@aksharatoday) July 9, 2026
ఇది కూడా చదవండి..: Godavari Water Levels | దిగువన గోదావరికి జలకళ.. ఎగువన వెలవెల