Energy Efficient Boiler Training | ఇంధన సామర్థ్య స్టీమ్​, బాయిలర్​ వ్యవస్థలపై శిక్షణ పూర్తి

జిల్లాలో ఇంధన సామర్థ్య స్టీమ్, బాయిలర్ వ్యవస్థలపై నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Energy Efficient Boiler Training | జిల్లా (Rajanna Siricilla)లో ఇంధన సామర్థ్య స్టీమ్, బాయిలర్ వ్యవస్థలపై నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Energy Efficient Boiler Training | ఇంధన వినియోగాన్ని తగ్గించి..

ఎన్ఐ ఎంఎస్ఎంఈ, ఎన్‌పీసీ, యునిడో, జీఈఎఫ్-7 సంయుక్త ఆధ్వర్యంలో 2026 అక్టోబర్ 23, 24 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎంఎస్ఎంఈ పరిశ్రమల బాయిలర్ ఆపరేటర్లు, టెక్నీషియన్లు ఇంధన వినియోగాన్ని తగ్గించి, సుస్థిరమైన హరిత పద్ధతులను పాటించేలా ఈ శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా సిరిసిల్ల పరిసరాల్లోని టెక్స్‌టైల్ డైయింగ్ యూనిట్లు, సైజింగ్ పరిశ్రమలు, రైస్​మిల్లుల వద్ద బాయిలర్ వ్యవస్థలను నిపుణుల బృందం ప్రత్యక్షంగా పరిశీలించింది. సీనియర్ నిపుణులు డాక్టర్ ఏ.కె. అస్థానా, ముత్యాల శరత్, నిరంజన్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని శిక్షణ అందించారు.

ఇది కూడా చదవండి..: KGBV Inspection | కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్​ గరిమ అగ్రవాల్​..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *