KGBV Inspection | కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్​ గరిమ అగ్రవాల్​

తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల (కేజీబీవీ) విద్యాలయాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం తనిఖీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: KGBV Inspection | తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల (కేజీబీవీ) విద్యాలయాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal) శనివారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు.

KGBV Inspection | ఫిర్యాదులపై ఆరా

అనంతరం కిచెన్ ఆవరణ, ఫ్రీజర్, సరుకులు తనిఖీ చేసి.. అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. అలాగే కంప్లైంట్స్ బాక్స్​ను పరిశీలించి.. ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు. కంప్లైంట్స్ బాక్స్​లో వచ్చే ఫిర్యాదులపై స్పందించాలని, ఆయా సమస్యలు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి..: Telangana Land Resurvey | భూముల రీసర్వేకు రైతులు సహకరించాలి..: అదనపు కలెక్టర్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *