Telangana Land Resurvey | భూముల రీసర్వేకు రైతులు సహకరించాలి : అదనపు కలెక్టర్​

భూముల రీసర్వేకు రైతులు సహకరించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Telangana Land Resurvey | భూముల రీసర్వేకు రైతులు (Farmers) సహకరించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కోరారు. కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామంలో భూముల రీ సర్వే కొనసాగుతుండగా, శనివారం క్షేత్రస్థాయిలో అదనపు కలెక్టర్ పరిశీలించారు.

Telangana Land Resurvey | భూముల వివరాలు పక్కాగా సేకరించాలి

అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ.. భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పక్కాగా సేకరించాలన్నారు. రోజూవారీగా లక్ష్యం నిర్దేశించుకుని, రీసర్వే పూర్తి పారదర్శకతతో చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో సర్వే చేసే ముందు ఏఏ సర్వే నంబర్​లో భూముల రీసర్వే చేయనున్నారో సమాచారం చేరవేయాలని ఆదేశించారు. రీ సర్వే, ఇతర పనులను తహశీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. సర్వేపై ఎలాంటి అపోహలు వద్దని, సర్వేకు రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.

Telangana Land Resurvey | అధికారులు సూచనలు పాటించాలి

సూపర్ ఎల్​నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా.. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు పంటలు సాగు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని పేర్కొన్నారు. ఆయిల్ పామ్, పప్పు ధాన్యాలు, కూరగాయలు, ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. సమావేశంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, తహశీల్దార్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Sircilla White Coat Ceremony | ఉత్తమ వైద్య సేవలతో ఉన్నత స్థానాలకు ఎదగాలి: కలెక్టర్​ గరిమ అగ్రవాల్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *