MVSR College Incident | ఎంవీఎస్​ఆర్​ కాలేజీ ఘటనలో ముగ్గురి అరెస్ట్​

ఎంవీఎస్ఆర్​ కాలేజీ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: MVSR College Incident | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని నాదర్​గుల్​లో గల ఎంవీఎస్​ఆర్​ కాలేజీలో ఇటీవల దాండియా కార్యక్రమం నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. లైటింగ్​ స్టాండ్​ కూలిపోవడంతో ఓ విద్యార్థి చనిపోయింది. ఈ ఘటనలో పోలీసులు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.

ఎంవీఎస్​ఆర్​ కాలేజీలో అక్టోబర్ 17న దండియా కార్యక్రమంలో ఇనుప ట్రస్ కూలిపోయి ఒక విద్యార్థి మరణించగా, మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభింంచారు. ఈ మేరకు తాజాగా ఈవెంట్​ మేనేజ్​మెంట్​ కంపెనీకి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈవెంట్ సిబ్బంది, కళాశాల కోఆర్డినేటర్లతో సహా మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. అరెస్టు అయిన వారిలో ఈవెంట్ ఆర్గనైజర్ మల్లేల సాకేత్ (22), పీఎస్-లైటింగ్స్ అండ్ సౌండ్స్‌కు చెందిన బతుల పునీత్ (21), సాయం నిశాంత్ యాదవ్ (24) ఉన్నారు.

MVSR College Incident | భద్రతా లోపాలు

ఈవెంట్​ నిర్వహణలో భద్రతా లోపాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాకేత్ ‘క్రియా ఆపరేషన్స్’ పేరిట ఈవెంట్స్​ నిర్వహిస్తూ. వేదిక, ట్రస్, సౌండ్ సిస్టమ్, జనరేటర్, లైటింగ్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను తీసుకున్నాడు. ట్రస్‌ను నాలుగు స్తంభాలకు బదులుగా కేవలం రెండు స్తంభాలతోనే నిర్మించారు. దీంతోనే అది కూలిపోయి విద్యార్థులపై పడింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Gold Smuggling | బంగ్లాదేశ్​ నుంచి హైదరాబాద్​కు గోల్డ్​ స్మగ్లింగ్​.. ఐదుగురి అరెస్ట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *