అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో అమెరికా, ఇరాన్‌లు పరస్పరం దాడులు కొనసాగిస్తుండడంతో ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్లు దాటింది. దేశీయ అవసరాలలో అత్యధిక భాగం ముడిచమురు కోసం దిగుమతులపైనే ఆధారపడిన భారత్‌ను ఇది ఆందోళనకు గురిచేస్తోంది. దిగుమతుల భారం అధికమై, ద్రవ్యోలోటు పెరిగే అవకాశాలు ఉండడంతో మార్కెట్ ఒత్తిడికి గురవుతోంది.
Indian Stock Market | లాభాలతో ప్రారంభమైనా..
భారత్ -అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశంపై ఆశాభావం నెలకొనడంతో బుధవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. ఐటీ స్టాక్స్ ప్రధాన సూచీలను పరుగులు తీయించాయి. అయితే ముడి చమురు ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో ప్రాఫిట్ బుకింగ్ దిగారు. దీంతో ప్రధాన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ ఊచకోతకు గురవుతున్నాయి.
Indian Stock Market | ఇంట్రాడే గరిష్టాలనుంచి భారీగా పతనం..
సెన్సెక్స్ శుక్రవారం ఉదయం 485 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమైంది. అక్కడినుంచి మరో 345 పాయింట్లు పైకి ఎగబాకింది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి 1,010 పాయింట్లు పతనమైంది. 128 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. మరో 104 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 331 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టంతో 73,686 వద్ద, నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో 22,798 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 19 స్టాక్స్ లాభాలతో, 20 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ఇన్ఫోసిస్ 2.60 శాతం, టెక్ మహీంద్రా 2.19 శాతం, టీసీఎస్ 2.19 శాతం, హెచ్సీఎల్ టెక్ 2.09 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.01 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : బజాజ్ ఫైనాన్స్ 3.50 శాతం, ఎటర్నల్ 3.12 శాతం, మారుతి 1.98 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.93 శాతం, ఎం అండ్ ఎం 1.84 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Jio IPO | అతిపెద్ద ఐపీవో.. లాభాలు అందించేనా?