AP Municipal Elections | మున్సిపల్​ ఎన్నికలపై సుప్రీంకోర్టులో వైసీపీకి ఊరట

మున్సిపల్ ఎన్నికలపై వైఎస్సార్​సీపీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: AP Municipal Elections | ఏపీలో స్థానిక ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఈ క్రమంలో పలువురు అభ్యర్థులు నామినేషన్​ వేయలేకపోయారు.

మున్సిపల్​ ఎన్నికల నామినేషన్ల సమయంలో హింస, తమ అభ్యర్థులపై దాడిపై వైసీపీ సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. ఈ పిటిషన్​పై బుధవారం ధర్మాసనం విచారణ చేపట్టి, కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 25 వరకు పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రకటించవద్దని పేర్కొంది. నామినేషన్లు వేయని చోట 48 గంటల సమయం పెంచాలని సూచించింది. హింస, ఆటంకాలపై వచ్చిన ఫిర్యాదులను రేపటిలోగా పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికలు ప్రమాదంలో ఉన్నప్పుడు, ఎన్నికల విషయాలలో న్యాయవ్యవస్థకు ఇచ్చే ప్రాధాన్యత, జోక్యం చేసుకోలేని విధంగా రాజ్యాంగ న్యాయస్థానాలను శక్తిహీనులుగా చేయలేదని కోర్టు పేర్కొంది.

AP Municipal Elections | నామినేషన్లు వేసే హక్కు

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని ధర్మాసనం పేర్కొంది. నామినేషన్లు దాఖలు చేసి పాల్గొనే హక్కు అనేది స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలలో ఒక అంశం అని స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎలక్ట్రానిక్ ఆధారాలతో సహా విజ్ఞప్తులను పరిశీలించి, నామినేషన్ల గడువును పొడగించాలని పేర్కొంది. గడువు పొడిగించిన పక్షంలో ఆ నిర్ణయం వెలువడిన తేదీ నుండి అభ్యర్థులకు కనీసం 48 గంటల సమయం ఇవ్వాలని ఆదేశించింది. నామినేషన్లు, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా డీజీపీ చర్యలు చేపట్టాలని సూచించింది. నిబంధనల పాటింపుపై నివేదికలను తమకు సమర్పించాలని ఆదేశించింది. విచారణను అక్టోబర్ 27న వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి..: Amaravati Outer Ring Road | అమరావతి అభివృద్ధికి భారీ బూస్ట్‌.. రూ.30,491 కోట్లతో ఔటర్ రింగ్‌ రోడ్డు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *