అక్షరటుడే, వెబ్‌డెస్క్: AP AI GST Model | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను జీఎస్టీ నిర్వహణలో సమర్థంగా వినియోగిస్తున్న ఆంధ్రప్రదేశ్ విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ అనుసరిస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ మోడల్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది.
జీఎస్టీ వ్యవస్థలో ఏఐను వినియోగించడం ద్వారా పన్నుల నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థంగా మార్చడంతోపాటు జవాబుదారీతనాన్ని పెంచుతున్న తీరును కేంద్రం అభినందించినట్లు సమాచారం. పన్ను ఎగవేతలను గుర్తించడం, డేటాను విశ్లేషించడం, అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడం వంటి అంశాల్లో సాంకేతికతను వినియోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఏపీ మోడల్ ద్వారా వెల్లడైనట్లు పేర్కొంది.
AP AI GST Model | ఇతర రాష్ట్రాలకు ఏపీ మోడల్
ఏపీలో అమలు చేస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించి, తమ అవసరాలకు అనుగుణంగా అమలు చేయాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ జీఎస్టీ మోడల్ దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఏర్పడింది.
ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ విధానంపై అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఏఐ ఆధారిత పన్ను నిర్వహణలో ఏపీ అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించి, తమ రాష్ట్రాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించేందుకు ఆయా రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
ఏఐ వినియోగంతో పన్ను వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగడంతోపాటు అధికారుల పనితీరు, పన్ను చెల్లింపుదారుల సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.