అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Kidnap Case | హైదరాబాద్ నగరంలోని గాజులరామారంలో వ్యాపారవేత్త అశోక్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. అశోక్ రెడ్డిని అపహరించిన అనంతరం కిడ్నాపర్లు ఈ విషయాన్ని ఆయన భార్యకు తెలియజేసినట్లు సమాచారం.
Hyderabad Kidnap Case | భాగస్వామితో విభేదాలు..
అశోక్ రెడ్డికి వ్యాపార భాగస్వామి చంద్రశేఖర్‌తో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాపార విభేదాల నేపథ్యంలోనే కిడ్నాప్ జరిగి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
భర్త కిడ్నాప్ విషయాన్ని పోలీసులకు తెలియజేసిన ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దుండగుల ఆచూకీ, అశోక్ రెడ్డి ఎక్కడ ఉన్నారనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.