​Rice Mill Raids | రైస్ మిల్లులపై దాడులు ఆపాలి

రైస్ మిల్లులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోరింది.

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్ : ​Rice Mill Raids | రాష్ట్రంలో రైస్ మిల్లులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోరింది. నిజామాబాద్‌ (Nizamabad)లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి మాట్లాడారు.

​Rice Mill Raids | ​మిల్లర్లపై బురద చల్లే ప్రయత్నం

​వ్యవస్థలో పది శాతం మంది తప్పు చేస్తే, మిగతా మిల్లర్లందరిపై బురదజల్లడం సరైంది కాదని మోహన్ రెడ్డి అన్నారు. బియ్యం ధరలు పెరగడానికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణం కానీ మిల్లర్లు కాదన్నారు. పక్క రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి ధాన్యం కొనకుండా తాను అడ్డుకుంటున్నట్లు, లారీలను నిలిపివేస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాను ఎవరినీ బెదిరించలేదని స్పష్టం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

బీఆర్ఎస్ పార్టీ తనపై కక్ష గట్టి ప్రచారం చేస్తోందని, బీజేపీని విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని విపక్షాలకు సవాల్ విసిరారు. నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని కలెక్టర్, సీపీలను కోరారు. తాను కేవలం వ్యాపారం చేసుకునే వ్యక్తినని, అనవసరంగా బురద చల్లవద్దని విజ్ఞప్తి చేశారు.

​Rice Mill Raids | ​రైతులకు పూర్తి స్వేచ్ఛ

ధాన్యం కొనుగోలు చేయడానికి ఎక్కడి నుంచైనా వ్యాపారులు రావచ్చు. రైతులు ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడే ధాన్యం అమ్ముకోవచ్చని తెలిపారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. రాబోయే ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియలో ప్రభుత్వానికి తమ అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం ఉంటుందని మోహన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్లు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Revanth Reddy | మోదీ సింహాసనం దిగి పోవాలి : సీఎం రేవంత్​రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *