HYDRAA Lake Protection | మరో చెరువును కాపాడిన హైడ్రా

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: HYDRAA Lake Protection | హైడ్రా మరో కుంటను కాపాడింది. రంగారెడ్డి (Rangareddy) జిల్లా అబ్దుల్లాపూర్​మెట్‌ మండ‌లం కుంట్లూరు గ్రామ ప‌రిధిలో ఉన్న 1.09 ఎక‌రాల బంట్లూనిబాయి ఆక్రమణల నుంచి రక్షించింది.

స‌ర్వే నంబ‌రు 24లో 89 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉంది. అందులో ఈ కుంట కూడా ఉంది. అయితే కుంట చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని ఇప్పటికే కబ్జా చేశారు. కొందరు ఇళ్లు సైతం కట్టుకున్నారు. ఈ క్రమంలో 1.09 ఎకరాల కుంటను సైతం కబ్జా చేయాలని కొందరు యత్నించారు. అందులో మట్టి నింపి, ప్లాట్లుగా మార్చే యత్నం చేస్తున్నారంటూ స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో మ‌ట్టిపోసి చ‌దును చేసిన‌ట్టు నిర్ధార‌ణ కావ‌డంతో చుట్టూ గురువారం చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

HYDRAA Lake Protection | ఫతేనగర్​లో నాలా పూడిక‌తీత

హైదరాబాద్​ నగరంలోని ఫతేనగర్​–బాలానగర్ (Fathe Nagar)​ పారిశ్రామిక వాడ వర్షం పడితే నీట మునుగుతుంది. నాలాలో పూడిక పేరుకుపోవడంతో వరద నీరు వెళ్లే మార్గం లేక ఫతేనగర్​ నీట మునుగుతోంది. ఈ క్రమంలో తాజాగా హైడ్రా అధికారులు నాలా పూడికతీత పనులు చేపట్టారు. ద‌శాబ్దాలుగా పేరుకుపోయిన పూడిక‌ను తొల‌గించేందుకు శ్రీ‌కారం చుట్టింది. నాలా పూడికతీత పనులను హైడ్రా కమిషనర్​ రంగనాథ్ గురువారం పరిశీలించారు. కాగా ఆక్రమణలతో నాలా కుచించుకుపోయిందని అధికారులు ఆయనకు వివరించారు. అక్క‌డి పారిశ్రామిక యూనిట్ల వారితో స‌మావేశాన్ని ఏర్పాటు చేసి.. ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలని హైడ్రా కమిషనర్​ సూచించారు.

దీనిని కూడా చదవండి : Akun Sabharwal | మళ్లీ తెలంగాణకు ఐపీఎస్​ అకున్​ సభర్వాల్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *