హైదరాబాద్Hyderabad Fire Accident | హైదరాబాద్​లో మరో అగ్నిప్రమాదం

Hyderabad Fire Accident | హైదరాబాద్​లో మరో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని తాడ్‌బాన్‌లో స్క్రాప్ షాపు, టింబర్​ డిపోలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Fire Accident | హైదరాబాద్ (Hyderabad)​లో వరుస అగ్ని ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయి. తాజాగా పాతబస్తీలోని బహదూర్‌పురాలో పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి.

హైదరాబాద్‌లోని బహదూర్‌పురా (Bahadurpura)లో జూ పార్క్ సమీపంలోని తాడ్‌బాన్‌లో ఉన్న ఒక స్క్రాప్ షాపు, టింబర్​ డిపో (Timber Depot)లో గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Hyderabad Fire Accident | 4 ఫైరింజన్లతో..

అగ్నిమాపక సిబ్బందికి సమాచారం. వారు నాలుగు ఫైర్​ ఇంజిన్​లతో ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ముందు జాగ్రత్తగా చుట్టు పక్కల వారిని పోలీసులు ఖాళీ చేయించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad Fire Accident | వరుస ప్రమాదాలు

వేసవి కాలం ప్రారంభం అయిన నాటి నుంచి నగరంలో అగ్ని ప్రమాదాలు (Fire Accidents) పెరిగాయి. పారిశ్రామిక ప్రాంతాలతో పాటు ఫర్నిచర్ దుకాణాలు, టింబర్​ డిపోలు, స్క్రాప్​ గోడౌన్​లలో ఎక్కువగా మంటలు అంటుకున్నాయి. ఇటీవల కిషన్​బాగ్​లోని సోఫా తయారీ కేంద్రంలో పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. గతంలో సైతం పలు దుకాణాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. అయినా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఫైర్​ సేఫ్టి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవడం లేదు.

ఇది కూడా చదవండి..: Software Engineer Suicide | “నమ్మకమే శాపమైంది”.. భార్య అక్రమ సంబంధం తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణం!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mamata Banerjee Protest | అర్ధరాత్రి బెంగాల్​లో ఉద్రిక్తత.. స్ట్రాంగ్​ రూమ్​ వద్ద మమత బెనర్జీ ఆందోళన

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mamata Banerjee Protest | బెంగాల్​ (Bengal)లో గురువారం...

Petrol Bunk Scam | పెట్రోల్​ బంక్​లో నయా స్కామ్​.. వాహనదారుల ఆందోళన

అక్షరటుడే, వెబ్​డెస్క్: Petrol Bunk Scam | పెట్రోల్​ బంక్​ల్లో కొత్త...

Goa Hockey Accident | గోవాలో విషాద ఘటన.. హాకీ బంతి తలకు తగిలి 13 ఏళ్ల బాలిక మృతి..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Goa Hockey Accident | గోవా (Goa)లోని...