హైదరాబాద్Petrol Bunk Scam | పెట్రోల్​ బంక్​లో నయా స్కామ్​.. వాహనదారుల ఆందోళన

Petrol Bunk Scam | పెట్రోల్​ బంక్​లో నయా స్కామ్​.. వాహనదారుల ఆందోళన

పెట్రోల్​ బంక్​ల్లో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. ఓ వ్యక్తి కారులో ట్యాంక్​ కెపాసిటీ కంటే ఎక్కువ పెట్రోల్​ పోసినట్లు సిబ్బంది చెప్పడంతో అతడు షాక్​ అయ్యాడు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Petrol Bunk Scam | పెట్రోల్​ బంక్​ల్లో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని హయత్​ నగర్​ (Hayathnagar) హెచ్​పీ పెట్రోల్​ బంక్​ (HP Petrol Pump)కు వెళ్లిన ఓ వ్యక్తి తన కారులో పెట్రోల్​ పోయించుకున్నాడు.

కారులో 32 లీటర్ల పెట్రోల్ నింపినట్లు మీటర్​లో రికార్డు కాగా.. సిబ్బంది అంతే మొత్తానికి డబ్బులు అడిగారు. అయితే తన కారు ట్యాంక్​ సామర్థ్యం 27 లీటర్లే అని.. 32 లీటర్ల పెట్రోల్​ ఎలా పోశారని కారు యజమాని ప్రశ్నించాడు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కారులో అప్పటికే కొంత పెట్రోల్​ ఉందన్నారు. 27 లీటర్ల కెపాసిటీ ఉంటే 32 లీటర్లు పోశామని ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై ప్రశ్నిస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Petrol Bunk Scam | అనేక ఘటనలు

పెట్రోల్​ బంక్​ల్లో మోసాలపై గతంలో సైతం అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పెట్రోల్​ పోయకముందే మీటర్​ తిరగడం, లీటర్​ పోస్తే తక్కువ ఇంధన రావడం వంటి మోసాలపై ఎన్నో ఫిర్యాదులు అందాయి. మీటర్​ ట్యాంపరింగ్​ (Meter Tampering) చేసి బంక్​ల నిర్వాహకులు ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మనం చెప్పినదాని కంటే తక్కువ మొత్తంలో పెట్రోలు పోస్తారని విమర్శలు ఉన్నాయి. అయినా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో బంక్​లో మోసాలు ఆగడం లేదు.

Petrol Bunk Scam | ఇలా చేస్తే మేలు

ప్రస్తుతం ఆధునిక సాంకేతికత పెరిగింది. కార్లు, బైక్​లో కంపెనీలు అత్యాధునిక ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నాయి. అదే విధంగా ఇంధన ట్యాంక్​లో ఎంత ఇంధనం ఉందో.. డిజిటల్​గా కనిపించేలా ఏర్పాట్లు చేస్తే పెట్రోల్​ బంక్​లో మోసాలను అరికట్టవచ్చు. ప్రస్తుతం ఎంత పెట్రోలు ఉందో చూపెడుతున్నా.. ఎన్ని లీటర్లు ఉందో తెలియదు. అలా కాకుండా వాహనంలో ఎన్ని లీటర్ల పెట్రోల్​ ఉందో తెలిసేలా వ్యవస్థను అభివృద్ధి చేస్తే.. పెట్రోల్​ బంక్​లో మోసాలకు చెక్​ పడుతుంది. ఉదాహరణకు కారులో 10 లీటర్ల ఇంధనం ఉంటే.. బంక్​కు వెళ్లి మరో 10 లీటర్లు పోయించామనుకోండి. అప్పుడు 20 లీటర్లు అని చూపెడుతంది. తక్కువ ఇంధనం పోస్తే అక్కడే తెలిసిపోతుంది.

ఇది కూడా చదవండి..: Hyderabad Fire Accident | హైదరాబాద్​లో మరో అగ్నిప్రమాదం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mamata Banerjee Protest | అర్ధరాత్రి బెంగాల్​లో ఉద్రిక్తత.. స్ట్రాంగ్​ రూమ్​ వద్ద మమత బెనర్జీ ఆందోళన

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mamata Banerjee Protest | బెంగాల్​ (Bengal)లో గురువారం...

Hyderabad Fire Accident | హైదరాబాద్​లో మరో అగ్నిప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Fire Accident | హైదరాబాద్ (Hyderabad)​లో వరుస అగ్ని...