Ganesh Immersion | తెల్లవారుజాము వరకు కొనసాగనున్న నిమజ్జనం

హైదరాబాద్​ నగరంలో ఇంకా 4500 గణేశ్​ విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ganesh Immersion | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో గణేశ్​ నిమజ్జన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పలు విగ్రహాలు ఇంకా శోభాయాత్ర మార్గంలోనే ఉన్నాయి. శనివారం ఉదయం వరకు నిమజ్జనం సాగే అవకాశం ఉంది. దీంతో పోలీసులు ఏర్పాట్లు చేశారు.

నిమజ్జనం నేపథ్యంలో 10 వేల సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, నిరంతర సమన్వయంతో శోభాయాత్రను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్​ సీపీ సజ్జనార్ (CP Sajjanar)​ బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ & కంట్రోల్ సెంటర్​ను శుక్రవారం సాయంత్రం సందర్శించారు. శోభాయాత్ర మార్గాలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

Ganesh Immersion | 10,300 విగ్రహాల నిమజ్జనం

నగరంలో మొత్తం 14,850 విగ్రహాల నిమజ్జనం అవుతాయని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటి వరకు 10,300 విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని సీపీ తెలిపారు. సుమారు 4,500 విగ్రహాలు మిగిలి ఉండగా, వాటిని తెల్లవారుజాముకల్లా పూర్తి చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో శోభాయాత్ర, నిమజ్జన ప్రక్రియను పరిశీలిస్తున్నారు. విద్యుత్ శాఖ, జీహెచ్‌ఎంసీ (GHMC), ఆర్‌టీసీ (TGSRTC), వైద్య శాఖ, ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

 

దీనిని కూడా చదవండి  : Revanth Reddy | సంఘ్​ పరివార్​తో ప్రజాస్వామ్యానికి ప్రమాదం : సీఎం రేవంత్​రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *