Revanth Reddy | సంఘ్​ పరివార్​తో ప్రజాస్వామ్యానికి ప్రమాదం : సీఎం రేవంత్​రెడ్డి

సంఘ్​ పరివార్​తో దేశానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy | సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంఘ్​ పరివార్​తో దేశానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందన్నారు. ఆర్యదాన్ ముహమ్మద్ – 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డ్స్‌కార్య‌క్ర‌మంలో ఆయన మాట్లాడారు.

సీఎం రేవంత్​రెడ్డికి కేరళం (Keralam)లో‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026 బెస్ట్‌ పబ్లిక్‌ సర్వెంట్‌ అవార్డు’ లభించింది. నిలంబూరులో శుక్రవారం ఆయన అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ అవార్డు అందుకోవడం గర్వకారణంగా ఉందని చెప్పారు. సంఘ్ ప‌రివార్ సార‌థ్యంలోని బీజేపీ ప్ర‌భుత్వం దేశాన్ని మ‌తం పేరిట విభజిస్తోందని రేవంత్​రెడ్డి ఆరోపించారు. గాంధీ ప‌రివార్ మాత్రం భార‌త ఐక్య‌త‌కు కృషి చేస్తోంద‌న్నారు. కేరళ రాజకీయాలతో దేశ రాజకీయాలు ముడి పడి ఉన్నాయని తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ కేరళలో విజయం సాధించడంతో వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో సైతం విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

Revanth Reddy | లౌకికవాదం కోసం పోరాటం

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం కోసం జీవితాంతం పని చేశారని రేవంత్​రెడ్డి అన్నారు. దేశంలో ప్రస్తుతం మతతత్వ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, ఓటు హక్కును రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడమే తన లక్ష్యమని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

దీనిని కూడా చదవండి : Kaleshwaram Motors | మోటార్లు నడిపి జలాశయాలను నింపాలి : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *