Rapido Ownly Hyderabad | హైదరాబాద్‌లో ‘రాపిడో’ ఓన్లీ ఫుడ్ డెలివరీ యాప్ లాంచ్.. టాలీవుడ్ స్టార్ నాని సందడి

ప్రముఖ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ 'రాపిడో' (Rapido) తన ఫుడ్ డెలివరీ యాప్ 'ఓన్లీ' (Ownly) సేవలను బెంగళూరు తర్వాత తాజాగా హైదరాబాద్‌లోనూ అధికారికంగా ప్రారంభించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Rapido Ownly Hyderabad | ప్రముఖ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ ‘రాపిడో’ (Rapido) తన ఫుడ్ డెలివరీ యాప్ ‘ఓన్లీ’ (Ownly) సేవలను బెంగళూరు తర్వాత తాజాగా హైదరాబాద్‌లోనూ అధికారికంగా ప్రారంభించింది. రెస్టారెంట్లు , కస్టమర్లకు ఎలాంటి అదనపు భారాలు లేకుండా, అత్యంత పారదర్శకమైన ధరలతో ఈ సేవలను అందిస్తోంది. కేవలం ఆహారం , డెలివరీ చార్జీలు మాత్రమే చెల్లించే సరికొత్త ‘జీరో-కమిషన్’ మోడల్‌తో ఈ యాప్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.

Rapido Ownly Hyderabad | ముఖ్య అతిథిగా నాని ..

హైదరాబాద్‌లో ఓన్లీ యాప్ లాంచ్‌ను పురస్కరించుకుని రాపిడో సంస్థ తమ డెలివరీ పార్టనర్లు లేదా ‘కెప్టెన్ల’ కోసం ప్రత్యేకంగా ఒక బిర్యానీ పార్టీని నిర్వహించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కెప్టెన్లు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ నాని  ( Nani )ముఖ్య అతిథిగా విచ్చేసి, రాపిడో కెప్టెన్లతో ముచ్చటించి వారిని ఉత్సాహపరిచారు. రాపిడో ప్రయాణంలో వెన్నుదన్నుగా నిలుస్తున్న కెప్టెన్ల సేవలను గుర్తించేందుకే ఈ వేడుకను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది.

Rapido Ownly Hyderabad | ఓన్లీ ప్రత్యేకతలు..

ఓన్లీ యాప్ ప్రధానంగా జీరో-కమిషన్ మోడల్‌పై పనిచేస్తుంది, అనగా రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమిషన్ వసూలు చేయరు కాబట్టి రెస్టారెంట్లు తాము సంపాదించుకున్న మొత్తం సొమ్మును పూర్తిగా ఉంచుకోవడానికి వీలవుతుంది. ఇక కస్టమర్ల విషయానికి వస్తే, వారు ఆర్డర్ చేసిన ఆహారానికి , కేవలం వాస్తవ డెలివరీ ఛార్జీకి మాత్రమే డబ్బు చెల్లిస్తారు కాబట్టి ఎలాంటి దాగుడుమూతలు, అదనపు ఛార్జీలు ఉండవు. ఈ విస్తరణ ద్వారా హైదరాబాద్‌లోని రాపిడో కెప్టెన్లకు ఫుడ్ డెలివరీ ద్వారా మరింత ఉపాధి, అదనపు ఆదాయం లభించనుంది. ఈ సందర్భంగా రాపిడో, ఓన్లీ సహ-స్థాపకుడు అరవింద్ సంక మాట్లాడుతూ..”బిర్యానీ ప్రియులకు నిలయమైన హైదరాబాద్‌లో ఓన్లీని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా మోడల్ అత్యంత సరళమైనది. రెస్టారెంట్లు తాము ఆర్డర్ పొందిన దానిలో పూర్తి మొత్తం ఉంచుకుంటాయి. కస్టమర్లు తాము తిన్న ఆహారానికి, డెలివరీకి మాత్రమే డబ్బు చెల్లిస్తారు. బెంగళూరు మాదిరిగానే హైదరాబాద్ ప్రజలు కూడా ఈ పారదర్శక విధానాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాము” అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  Kaleshwaram Motors | మోటార్లు నడిపి జలాశయాలను నింపాలి : హరీశ్​రావు

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *