Kaleshwaram Motors | మోటార్లు నడిపి జలాశయాలను నింపాలి : హరీశ్​రావు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Motors | కాళేశ్వరం మోటార్లను నడిపి జలాశయాలను నింపాలని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) డిమాండ్​ చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి (Uttam Kumar Reddy)కి లేఖ రాశారు.

ఓ వైపు గోదావరిలో వరద పోతుంటే.. కాంగ్రెస్​ బురద రాజకీయాలు చేస్తోందని హరీశ్​రావు అన్నారు. ఎల్​నినో పేరు చెప్పి బాధ్యత నుంచి తప్పించుకోవద్దన్నారు. గోదావరి (Godavari) జలాలను సద్వినియోగం చేసుకోవడానికి కేసీఆర్ (KCR)​ కాళేశ్వరం నిర్మించారని తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు గోదావరిలో వరద ఉన్నా.. కాంగ్రెస్​ ప్రభుత్వం నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నీరందక పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్​ నాయకులు ప్రాజెక్టుల మీద రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు.

Kaleshwaram Motors | డెడ్​ స్టోరేజీలో రిజర్వాయర్లు

రాష్ట్రంలోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీలో ఉన్నాయని హరీశ్​రావు అన్నారు. మల్లన్న సాగర్​లో ప్రస్తుతం 13 టీఎంసీలు మాత్రమే ఉండడం ఆందోళన కలిగించే పరిణామం అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో నీరు ఉంటే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఢోకా ఉండదని చెప్పారు. కొండపోచమ్మ సాగర్​ జలాశయంలో 6 టీఎంసీల నీరు మాత్రమే ఉందన్నారు. వెంటనే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు ప్రారంభించి మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలను నింపాలని కోరారు. ప్రస్తుతం ఎల్లంపల్లి వద్ద గోదావరిలో ప్రవాహం ఉందని హరీశ్​రావు తెలిపారు. నిత్యం 24 గంటల పాటు అన్ని మోటార్లు నడిపి జలాశయాలను నింపాలని డిమాండ్ చేశారు.

దీనిని కూడా చదవండి  : SBI Bank Strike 2026 | బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. ఏటీఎం లావాదేవీలపై ఎస్‌బీఐ కీలక అప్‌డేట్

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *