అక్షరటుడే వెబ్‌డెస్క్: Vi Free International Roaming | ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా (Vi) తన కొత్త బ్రాండ్ వాగ్దానం “Vi Pe Sab Hain VIP” ని నిజం చేస్తూ మార్కెట్‌లో సంచలన ప్రకటన చేసింది. కీలకమైన పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ , ఎంటర్‌ప్రైజ్ (కార్పొరేట్) ప్లాన్లపై ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్ (International Roaming) సేవలను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సరికొత్త ఆఫర్‌తో వినియోగదారులు, వారి కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్లినప్పుడు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రపంచవ్యాప్తంగా 170కి పైగా దేశాల్లో కనెక్టెడ్‌గా ఉండవచ్చు.
Vi Free International Roaming | విదేశీ ప్రయాణాల్లో ఇక టెన్షన్ ఫ్రీ..
గతంలో విదేశాలకు వెళ్లాలంటే వేర్వేరు సిమ్ కార్లు మార్చడం, స్థానిక లేదా ట్రావెల్ సిమ్‌లను కొనుగోలు చేయడం, మన భారతీయ నంబర్‌ను కోల్పోవడం, ముఖ్యమైన ఓటీపీలు (OTPs) మిస్ కావడం, పబ్లిక్ వై-ఫైపై ఆధారపడటం లేదా ఊహించని రోమింగ్ బిల్లులతో ఆందోళన చెందడం వంటి ఇబ్బందులు ఉండేవి. వీఐ ఇప్పుడు ఆ అనుభవానికి పూర్తిగా స్వస్తి పలికింది. ఇంటర్నేషనల్ రోమింగ్‌ను మరింత సులభతరం చేసింది.
Vi Free International Roaming | ప్రయోజనాలు..
ఈ ఆఫర్‌కు సంబంధించి ముఖ్యాంశాలు , ప్రయోజనాల వివరాలను పరిశీలిస్తే.. ప్లాన్‌ను బట్టి పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ , కార్పొరేట్ కస్టమర్లు ఏడాదిలో గరిష్టంగా 3 ట్రిప్‌ల వరకు ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఇందులో తగినంత ఇంటర్నేషనల్ డేటా కోటా, అవుట్‌గోయింగ్ నిమిషాలు లభిస్తాయి. దీనివల్ల వినియోగదారులకు సంవత్సరానికి రూ. 9,000 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. అలాగే, వీఐ యాప్ (Vi App) ద్వారా చాలా సులభంగా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు.
Vi Free International Roaming | మార్కెటింగ్ చీఫ్ ఏమన్నారంటే..?
ఈ లాంచ్ గురించి వీఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవ్నీశ్ ఖోస్లా మాట్లాడుతూ.. “‘Vi Pe Sab Hain VIP’ అనేది కేవలం ఒక క్యాంపెయిన్ మాత్రమే కాదు, మేము కస్టమర్లకు ఇస్తున్న హామీ. విదేశీ ప్రయాణాలను సులువు చేయడం అందులో మొదటి అడుగు. సాధారణంగా ఇంటర్నేషనల్ రోమింగ్ అంటే ఖరీదైన ప్యాక్‌లు లేదా ట్రిప్ సిమ్‌లు కొనుగోలు చేయడం అనుకుంటారు. కానీ, మేము దీన్ని మా ప్లాన్లలోనే ఉచిత ప్రయోజనంగా అందిస్తున్నాము. ‘మీరు ప్రయాణించినప్పుడు రోమింగ్ కొనండి’ అనే పద్ధతి నుంచి ‘మీ వీఐ నంబర్ మీతో పాటు ఉచితంగా ప్రయాణిస్తుంది’ అనే సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టాము” అని తెలిపారు. ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ ( Shah Rukh Khan ) నటిస్తున్న కొత్త కమర్షియల్ యాడ్ ద్వారా ఈ ప్రచారాన్ని కంపెనీ నిర్వహిస్తోంది.
Vi Free International Roaming | ఏయే ప్లాన్లపై వర్తిస్తుంది?
ఈ ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్ సేవలు ప్రధానంగా రూ. 501 నుంచి ప్రారంభమయ్యే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై, వార్షిక అన్‌లిమిటెడ్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లపై అలాగే ఎంటర్‌ప్రైజ్ కస్టమర్ల కోసం రూ. 451 నుంచి ప్రారంభమయ్యే కార్పొరేట్ ప్లాన్‌లపై వర్తిస్తాయి. వినియోగదారులు కేవలం వీఐ యాప్‌ను ఓపెన్ చేసి, ఇంటర్నేషనల్ రోమ్-ఫ్రీ ప్లాన్‌లను ఎంచుకోవడం ద్వారా ఎలాంటి ఆందోళన లేకుండా సులభంగా విదేశీ ప్రయాణాలను ఆస్వాదించవచ్చు.
ఇది కూడా చదవండి: Kaleshwaram Motors | మోటార్లు నడిపి జలాశయాలను నింపాలి : హరీశ్‌రావు