అక్షరటుడే వెబ్‌డెస్క్: Tata Power EV Charging | ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్‌న్యూస్ చెబుతూ.. ప్రముఖ ఇంధన దిగ్గజం టాటా పవర్ (Tata Power) ఆంధ్రప్రదేశ్‌లో ( Andhra Pradesh )తన మొట్టమొదటి 240 kW డిసి అల్ట్రా-ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను లాంచ్ చేసింది. బెంగళూరు-చిత్తూరు-తిరుపతి/చెన్నై జాతీయ రహదారిపై ఉన్న ‘శ్రీ వర్ష గ్రాండ్’ వద్ద ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరు – చెన్నై నగరాలను కలిపే కీలకమైన ఇంటర్-సిటీ మార్గంలో ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో పాటు, ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు కూడా ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
Tata Power EV Charging | వేగవంతమైన ఛార్జింగ్..
ఈ ఛార్జింగ్ స్టేషన్ 240 కిలోవాట్ల భారీ సామర్థ్యంతో పనిచేస్తుంది. దీనివల్ల అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) అత్యంత వేగంగా ఛార్జ్ అవుతాయి. ఇది కేవలం వ్యక్తిగత కార్ల యజమానులకే కాకుండా, వాణిజ్య వాహన ఆపరేటర్లు , ఫ్లీట్ వినియోగదారులకు సుదూర ప్రయాణాల్లో ఎలాంటి ట్రిప్ యాంగ్జైటీ లేకుండా ప్రయాణించడానికి చక్కటి అవకాశం కల్పిస్తుంది. దక్షిణ భారతదేశంలోని కీలక మార్గాలలో మారుతున్న ఈవీ వినియోగదారుల అవసరాలను తీర్చేలా ఈ మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దారు.
Tata Power EV Charging | ప్రత్యేకతలు ..
సీసీఎస్-2 (CCS-2) కనెక్టర్లతో కూడిన ఈ స్టేషన్ మార్కెట్లో లభించే విస్తృత శ్రేణి ఈవీ మోడళ్లన్నింటికీ అనుకూలంగా ఉంటుంది. శ్రీ వర్ష గ్రాండ్’ వద్ద ఈ స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల.. వాహనం ఛార్జ్ అయ్యే సమయంలో ప్రయాణికులు అక్కడే భోజనం చేయడం, రెస్ట్‌రూమ్‌లను ఉపయోగించుకోవడం, పార్కింగ్ వంటి సదుపాయాలను ఆస్వాదిస్తూ తమ సమయాన్ని ప్రశాంతంగా సద్వినియోగం చేసుకోవచ్చు.
Tata Power EV Charging |టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్ నెట్‌వర్క్..
ఈ కొత్త ఛార్జింగ్ కేంద్రం.. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ‘టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్’ (Tata Power EZ Charge) నెట్‌వర్క్‌లో భాగమైంది. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 700లకు పైగా నగరాలు, పట్టణాలకు పాకింది. ఇందులో 6,700కు పైగా పబ్లిక్, క్యాప్టివ్ ఛార్జింగ్ పాయింట్లు, 2.5 లక్షలకు పైగా హోమ్ ఈవీ ఛార్జర్లు, 1,200కు పైగా ఈ-బస్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి.
ఈవీ వినియోగదారులు ‘టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్’ మొబైల్ యాప్ లేదా ఆర్ఎఫ్‌ఐడీ (RFID) కార్డులను ఉపయోగించి సులభంగా ఛార్జింగ్ స్టేషన్‌లను గుర్తించవచ్చు, వాటి లభ్యతను ముందే తనిఖీ చేసి ఛార్జింగ్ సెషన్‌లను ప్రారంభించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Kaleshwaram Motors | మోటార్లు నడిపి జలాశయాలను నింపాలి : హరీశ్‌రావు