Delhi HC AI Morphed Images | ఏఐ మార్ఫింగ్ వివాదం.. సీజేపీ నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Delhi HC AI Morphed Images | కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీని దుర్వినియోగం చేసి ఓ మహిళ ఫొటోను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ మహిళకు సంబంధించిన అభ్యంతరకర చిత్రాలను, వాటికి సంబంధించిన లింకులను కేవలం 24 గంటల్లోగా పూర్తిగా తొలగించాలని ప్రముఖ టెక్ దిగ్గజం ‘మెటా’ (Meta) సంస్థను హైకోర్టు ఆదేశించింది. అలాగే బాధితురాలైన మహిళకు తక్షణమే తగిన పోలీస్ రక్షణ కల్పించాలని కూడా స్పష్టం చేసింది.

Delhi HC AI Morphed Images | సీజేపీ నేతలకు నోటీసులు..

ఈ కేసుకు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రధాన నాయకులు సౌరవ్ దాస్, అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, రత్న సింగ్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ దుష్ప్రచారంలో సీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చని ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోర్టు తన నోటీసుల్లో పేర్కొంది. ఈ ఘటనపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ‘గుర్తుతెలియని వ్యక్తుల’పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Delhi HC AI Morphed Images | అసలు ఏం జరిగిందంటే..?

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన సీజేపీ నిరసన ప్రదర్శనల సమయంలో బాధితురాలి వ్యక్తిగత ఫొటోను ఎలాంటి అనుమతి లేకుండా ఏఐ ఫేస్ స్వాపింగ్ టెక్నాలజీ సాయంతో మార్ఫ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఉన్నట్లుగా ఆ అభ్యంతరకర చిత్రాన్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా ప్రచారం చేశారు. అంతేకాకుండా, నిరసన స్థలంలో ఏర్పాటు చేసిన బ్యానర్లు, పోస్టర్లపై కూడా ఆ ఫొటోను ప్రదర్శించినట్లు బాధితురాలు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మార్ఫింగ్ ఫొటోల వల్ల తనకు ప్రాణభయం, తీవ్ర బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించారు.

బాధితురాలి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆమెకు రక్షణ కల్పించాలని ఆదేశించడంతో పాటు, రెండు వారాల్లోగా ఈ కేసుపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.

ఇది కూడా చదవండి:  ASMITA Khelo India | అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపిక పూర్తి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *