అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ASMITA Khelo India | అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేశామని జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ అబ్బాపూర్ రవీందర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపిక వివరాలు వెల్లడించారు.
ASMITA Khelo India | నవీపేట్ ఉన్నత పాఠశాలలో..
నవీపేట్ మండల కేంద్రంలోని (Navipet Mandal) జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నవీపేట్ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం గంగమణి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్రీడాకారులు నిరంతర సాధనతో ఆటల్లో రాణించాలని సూచించారు. క్రమశిక్షణ గల పౌరులుగా ఎదిగేందుకు క్రీడలు దోహదం చేస్తాయన్నారు. చదువులు, ఆటలు రెండింటిలోనూ రాణించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం వెయిట్ లిఫ్టింగ్ పోటీలను పీడీ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యం లో నిర్వహించారు. కార్యక్రమంలో పీడీలు వెంకటేశ్వర్ రావు, అబ్బయ్య, రమేష్, గణేశ్, అలివేలు మంగమ్మ, అనురాధ, కవిత, ప్రమిత, కల్పన తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారిణులు ఈనెల 27వ తేదీ ఆదివారం రంగారెడ్డి జిల్లాలో జగనున్న రాష్ట్ర స్థాయి అస్మిత ఖేలో ఇండియా పోటీలకు ప్రాతినిథ్యం వహించనున్నారు.
ASMITA Khelo India | ఎంపికైన క్రీడాకారిణులు వీరే..
53 కిలోల బరువు కేటగిరీలో మీనాక్షి (గర్ల్స్ స్కూల్, నిజామాబాద్), వరూధిని (సిరికొండ), 57 కిలోల కేటగిరీలో అనిత (గర్ల్స్ స్కూల్ నిజామాబాద్), 61 కిలోల కేటగిరిలో ఆదిబా బేగం (గర్ల్స్ స్కూల్ నిజామాబాద్), 69 కిలోల కేటగిరీలో రుచిత (అమ్రాద్), వైశాలి (సిరికొండ), 77 కిలోల కేటగిరీలో అంజనా జ్యోతి ఎంపికయ్యారు.
ఇది కూడా చదవండి..: Dangerous U-turn | ప్రమాదకర డివైడర్.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు