అక్షరటుడే వెబ్‌డెస్క్: Andhra Floods 2026 | ఉత్తరాంధ్రపై వాయుగుండం ప్రభావం తీవ్రంగా కొనసాగుతోంది. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ఆకస్మిక వరదలు సంభవించడంతో వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి.
Andhra Floods 2026 | కొట్టుకుపోయిన ఎమ్మెల్యే..
శ్రీకాకుళం జిల్లాలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుకోకుండా వరద ఉధృతిలో చిక్కుకుని కొట్టుకుపోయారు. ఆయనతో పాటు అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ , ఇతర అధికారులు సైతం వరద ప్రవాహంలో కొట్టుకుపోతుండటంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళన నెలకొంది. వెంటనే అప్రమత్తమైన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) సిబ్బంది మరో బోటులో వేగంగా వెళ్లి వారందరినీ సురక్షితంగా రక్షించారు.
Andhra Floods 2026 | గర్భిణీని కాపాడిన సిబ్బంది..
ఈ ఆకస్మిక వరదలు స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. పార్వతీపురం ప్రాంతంలో వరద నీటిలో తొమ్మిది నెలల గర్భిణీ భూమిక చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా కాపాడారు. ఆమెకు లైఫ్ జాకెట్ తొడిగి సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అనంతరం, వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.
Andhra Floods 2026 | మంత్రి పరిశీలన..
జిల్లాలోని సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ పరిస్థితిని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్వయంగా పరిశీలించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే సాలూరులో దెబ్బతిన్న రోడ్లు, నిండిన చెరువులు, నీట మునిగిన పంటలు, ఇళ్ల పరిస్థితులపై ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
శ్రీకాకుళం జిల్లాలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్, ఎస్పీ సహా పలువురు అధికారులు వరద ఉధృతిలో చిక్కుకున్నారు. ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వారిని NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగి సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.… pic.twitter.com/ulxps07spW
— SkyC Breaking News (@SkyCMedia) September 25, 2026
ఇది కూడా చదవండి: Gyanesh Kumar Supreme Court Plea | ఓటర్ల సవరణ వివాదం: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్