అక్షరటుడే, కామారెడ్డి: Auto Car Accident | ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని రామారెడ్డి బైపాస్ బ్రిడ్జి వద్ద బుధవారం చోటుచేసుకుంది.
Auto Car Accident | రెడ్డిపేటకు వెళ్తుండగా..
కామారెడ్డి నుంచి రెడ్డిపేటకు ఆటో వెళ్తోంది. అదే సమయంలో రామారెడ్డి వైపు నుంచి కామారెడ్డికి ఓ కారు వస్తోంది. రామారెడ్డి రోడ్డులో గల బైపాస్ బ్రిడ్జి నూతనంగా నిర్మాణం అవుతున్న మసీదు వద్దకు రాగానే ఆటో, కారు ఒక్కసారిగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెడ్డిపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గొల్ల శంకర్, కారులో ప్రయాణిస్తున్న ముస్తాబాద్ మండలం ఆవునూర్ కొండాపూర్ గ్రామానికి చెందిన చిగురు నర్సవ్వకు గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న మరొక ప్రయాణికునికి కూడా గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి జీజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Drug Trafficking Control | మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలి..