అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | సూర్యాపేట (Suryapet) జిల్లా కోదాడ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వుయ్యాల సోమయ్య నివాసాలపై ఏసీబీ (ACB) అధికారులు గురువారం దాడులు చేశారు. ఈ క్రమంలో భారీగా అక్రమాస్తులను గుర్తించారు.
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య తన సర్వీసు కాలంలో అవినీతి పద్ధతుల ద్వారా ఆస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. గురువారం ఆయన ఇల్లు, కార్యాలయం, బంధువులు, సహచరులు, ఇతరులకు చెందిన మరో 7 ప్రదేశాలలో ప్రాథమిక సోదాలు నిర్వహించారు.
ACB Raids | భారీగా అక్రమాస్తులు
సోదాల సమయంలో ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్యకు సూర్యాపేట జిల్లాలో 3.03 ఎకరాల భూమి, సూర్యాపేట జిల్లా, హయత్‌నగర్ పరిధిలో ఐదు నివాస గృహాలు ఉన్నాయి. వీటిలో ఒక G+1 భవనం, ఒక G+2 భవనం, ఒక G+4 + పెంట్ హౌస్ భవనం, రెండు ఇళ్లు ఉన్నాయి, సూర్యాపేట పరిధిలోని పలు ప్రదేశాలలో ఎనిమిది ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.
ACB Raids | 66 తులాల బంగారం
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో అధికారులు రూ.4.63 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల్లో రూ.13 లక్షలు, రూ. 20 లక్షల విలువైన 709 గ్రాముల బంగారు ఆభరణాలు, 1750 గ్రాముల వెండి ఆభరణాలు గుర్తించారు. అంతేగాకుండా సోమయ్య 66 తులాల బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.49 లక్షల లోన్ తీసుకున్నాడు. అతడి వద్ద 2 కార్లు, మూడు బైక్లు ఉన్నాయి. నిందితుడి మొత్తం ఆస్తులు విలువ రూ.3.54 కోట్లు అని ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ అంతకంటే భారీగా ఉంటుంది. ఈ మేరకు ఏసీబీ అధికారులు నిందితుడిని అదుపుతోకి తీసుకున్నారు.
దీనిని కూడా చదవండి : Robbery Case Solved | 36 గంటల్లోనే దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు