Robbery Case Solved | 36 గంటల్లోనే దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

దోపిడీ జరిగిన కేసులో నిందితులను పోలీసులు 36 గంటల్లోనే పట్టుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Robbery Case Solved | దోపిడీ (Robbery ) జరిగిన కేసులో నిందితులను పోలీసులు 36 గంటల్లోనే పట్టుకున్నారు. ఈ మేరకు నాగిరెడ్డి పేట పోలీసులు (Nagireddypet Police) వివరాలు వెల్లడించారు

Robbery Case Solved | గోపాల్​పేట్​లో..

గతనెల 31న గోపాల్‌పేట్‌లోని దత్తు హాస్పిటల్ ఎదుట మెదక్​ జిల్లా పోచమ్మరాల్​ గ్రామానికి చెందిన దంపతులను ముగ్గురు వ్యక్తులు మాయమాటలు చెప్పి, బెదిరించి వారి వద్ద ఉన్న సుమారు 12 తులాల వెండి గొలుసు, రూ.15వేల నగదును దోచుకుని.. స్కూటీపై మెదక్ వైపు పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే నాగిరెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతో పాటు, హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ను సమర్థవంతంగా వినియోగించారు.

పోలీసుల సమన్వయంతో నిందితుల కదలికలు, వివరాలను 36 గంటల్లోనే గుర్తించారు. ఈనెల 2న నిందితులు తిరిగి నాగిరెడ్డిపేట మండలం వైపు వస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో, పోలీసులు అప్రమత్తమై పోచారం చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 12 తులాల వెండి గొలుసు, రూ.15,000 నగదు, నంబర్ ప్లేట్ లేని స్కూటీ, మూడు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్​కు తరలించారు.

ఇది కూడా చదవండి: మంత్రి కొండా సురేఖపై వేటు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *