Prajavani Complaints | ప్రజావాణికి 91 ఫిర్యాదులు

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Prajavani Complaints | ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ (Additional Collector Dileep Kumar) అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుదారులు తరలివచ్చారు.

Prajavani Complaints | పెండింగ్​లో ఉంచవద్దు..

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్​ దిలీప్​ కుమార్​ మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్​లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలన్నారు. ఆయనతో పాటు సబ్ కలెక్టర్లు వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato), అభిగ్యాన్ మాల్వియా, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, ఆర్డీవో రాజేంద్ర కుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్​లు వినతులు స్వీకరించారు. కాగా..ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Prajavani Complaints

ఇది కూడా చదవండి..: Women Reservation | మహిళా రిజర్వేషన్​కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు: డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *