Mega Family | మెగా ఫ్యామిలీకి క‌లిసి రాని 2026.. ఈ ఏడాది వ‌రుస స‌ర్జ‌రీల‌తో అభిమానుల్లో ఆందోళన, త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mega Family | మెగా ఫ్యామిలీలో  ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస ఆరోగ్య సమస్యలు అభిమానులను కలవరపెడుతున్నాయి. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు పలువురు మెగా హీరోలు గాయాలు, అనారోగ్య కారణాలతో చికిత్సలు పొందడం, శస్త్రచికిత్సలు చేయించుకోవడం వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరడం అభిమానుల్లో ఆందోళనను మరింత పెంచింది. అధికారులతో సమావేశంలో పాల్గొంటున్న సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనకు జూబ్లీహిల్స్‌లోని ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స జరగగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని సమాచారం. కనీసం పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.

Mega Family | వ‌రుణ్ తేజ్‌కి కూడా గాయం..

ఇదిలా ఉండగా, హీరో వరుణ్ తేజ్ (Varun Tej) కూడా ఇటీవల గాయంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ‘బరి’ సినిమా షూటింగ్ సందర్భంగా వాలీబాల్ సాధన చేస్తుండగా ఆయన కాలికి గాయమైంది. గాయం తీవ్రంగా ఉండటంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించగా, ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా షూటింగ్ సమయంలో గాయపడ్డారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో ఆయన ఎడమ కంటికి స్వల్ప గాయం అయింది. ఆ సమయంలో పుట్టినరోజు వేడుకల్లో కూడా బ్యాండేజ్‌తో కనిపించడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అయితే ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Mega Family | చిరంజీవి ఆరోగ్యం గురించి కూడా

అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆరోగ్యం గురించి కూడా ఇటీవల సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఆయనకు శస్త్రచికిత్స జరిగిందన్న ప్రచారం వచ్చినప్పటికీ, ఆ వార్తలను నిర్మాతలు ఖండిస్తూ అధికారికంగా ఎలాంటి సర్జరీ జరగలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ రూమర్లు అభిమానుల్లో కొంత ఆందోళనకు కారణమయ్యాయి.మొత్తంగా చూస్తే, కొద్ది కాలంలోనే పలువురు మెగా హీరోలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనడం యాదృచ్ఛికమే అయినప్పటికీ, అభిమానుల్లో మాత్రం ఆందోళన పెరిగింది. అయితే ప్రస్తుతం అందరూ కోలుకుంటున్నారన్న సమాచారం అభిమానులకు కొంత ఊరటనిస్తోంది. తమ అభిమాన హీరోలు త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ సెట్స్‌పైకి రావాలని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Pawan Kalyan Sinus Surgery | ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి జ‌రిగిన శ‌స్త్ర చికిత్స‌పై వ‌చ్చిన క్లారిటీ.. తిరుమ‌ల‌కి వెళ్లిన‌ప్పుడే బ‌య‌ట‌ప‌డిందా?

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *